పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
పూలరంగడు టైటిల్ నాగేశ్వరరావు ఇమేజిని దృష్టిలో పెట్టుకుని పెట్టారు, ఆ టైటిల్ పెట్టాకే దానికి అనుగుణంగా కథ రాశారు. మొత్తానికి అలా సినిమాలో టైటిల్ కన్నా ముందు నుంచే అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా నిర్ణయమైపోయినట్టన్న మాట. ఈ చిత్రంలో అక్కినేనికి [[చెల్లెలు|చెల్లెలుగా]] [[విజయనిర్మల]], [[బావ|బావగా]] [[శోభన్ బాబు]] లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర కథానాయక [[జమున]] అంతకు ముందు వచ్చిన దొంగరాముడు సినిమాలో అక్కినేనికి చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు ఆమెను అతనికి కథానాయకిగా ఎన్నిక చేసారు. [[గుమ్మడి]], [[చిత్తూరు నాగయ్య]], [[అల్లు రామలింగయ్య]] లాంటి కొంతమందిని తప్ప సినిమాలో కావలసిన అన్ని పాత్రలకు స్థానిక నాటక కళాకారులను తీసుకోవడం అప్పట్లో ఒక రికార్డు. ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరచిన సంఘటన కూడా.
== విడుదల ==
ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని వరుస అపజయాలపర్వంలో ఉన్నారు. [[ఆస్తిపరులు]], [[సుడిగుండాలు (సినిమా) | సుడిగుండాలు]], [[వసంతసేన]], [[ప్రాణ మిత్రులు]] లాంటి సినిమాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇది ఆయన ఐదో ప్లాపు సినిమాగా ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టే సినిమా పేరును బట్టి కథ రాయించడం, అదీ రకరకాల రచయితలు మారి మారి స్క్రిప్ట్ ఏమారిపోవడం వంటివి జరిగాయి. చివరకు చిత్రీకరణ ప్రారంభమై సాగుతున్నా క్లైమాక్స్, ఇతర ముఖ్యసన్నివేశాలు రాసుకోని స్థితి వుంది. అయితే సినిమా విడుదలయ్యాకా మాత్రం బాగా జనాదరణ పొందింది. అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతమౌతున్న నాగేశ్వరరావు స్వంత నిర్మాణం, పంపిణీలో తీసిన పూలరంగడు భారీ విజయం పొందడంతో కెరీర్ గాడిన పడింది.
 
== పాటలు ==
సినిమాలో అక్కినేని నాగయ్య తండ్రీకొడుకులుగా నటించారు, వారు జైల్లో కలుస్తారు, ఖైదీలతో కలసి 'చిల్లర రాళ్ళకు మొక్కితే చెడిపోవుదువురా' అనే గీతం ఉంటుంది. ఈ సన్నివేశానికి సెట్టింగ్ వేస్తే బావుండదని భావించిన దర్శక నిర్మాతలు అప్పటికి జైళ్ళ శాఖను చూస్తున్న మంత్రి [[పి.వి.నరసింహారావు]] ను సంప్రదిస్తే ఆయన [[చంచల్ గూడ]], [[ముషీరాబాద్]] జైళ్ళను షూటింగ్ కోసం అనుమతిచ్చారు.
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు