నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు

పురాతన పాశ్చాత్య సిద్ధాంతం
పంక్తి 7:
== సిద్ధాంతాలు ==
=== పురాతన పాశ్చాత్య సిద్ధాంతం ===
నాయకుల అలవాట్లు, లక్షణాల పై శోధన దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్లేటో నుండి ప్లూటార్క్ ల రచనల వరకు, "ఒక వ్యక్తిని నాయకుడిగా గుర్తించాలంటే అతనిలో ఉండవలసిన విశిష్టలక్షణాలేమిటి?" అనే ప్రశ్నను సంధించినవే. నాయకత్వం అనేది ఒక వ్యక్తియొక్క లక్షణాలలోనే ఉన్నది అనే భావనే దీనికి కారణం. [[విశిష్ట లక్షణాల నాయకత్వ సిద్ధాంతం|విశిష్ట లక్షణాల నాయకత్వ సిద్ధాంతానికి]] దారి తీసినది ఈ భావనే.
 
19వ శతాబ్దంలో రాజుల, అధిపతుల మరియు బిషప్ ల పెత్తనాలు పట్టు సడలుతున్నప్పుడు ఈ సిద్ధాంతాన్ని సుదీర్ఘంగా శోధించటం జరిగినది. 1841 లో థామస్ కార్లిలే రచించిన ''Heroes and Hero Worship (నాయకులు మరియు వారి ఆరాధన)''లో అధికారాన్ని సాధించిన పురుషుల ప్రతిభ, నైపుణ్యాలు మరియు భౌతిక లక్షణాలను గుర్తించాడు. 1869 లో ఫ్రాన్సిస్ గాల్టన్ రచించిన ''Hereditary Genius (వంశపారంపరిక ప్రజ్ఞాశాలి)'' లో శక్తిమంతులైన పురుషుల కుటుంబాలలోని నాయకత్వ లక్షణాలని పరీక్షించాడు. నాయకత్వం వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని, పుట్టుకతోనే నాయకులు అవుతారే గానీ మలచితే నాయకులు కాజాలరని గాల్టన్ తేల్చాడు. ఈ రెండు ప్రధాన పరిశోధనలు నాయకత్వమనేది నాయకుడి లక్షణాలలోనే ఉంటుందనే వాదన చేశాయి. తొలినాళ్ళలో ఈ వాదన అమోదించబడటమే కాక, ప్రజల అభిమానాన్ని కూడా చూరగొన్నది.
 
{{నిర్వహణ}}
"https://te.wikipedia.org/wiki/నాయకత్వం" నుండి వెలికితీశారు