"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
1961లో [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో [[ఎన్టీ రామారావు]] కథానాయకునిగా దాగుడుమూతలు సినిమా తీద్దామని నిర్మాత డి.బి.నారాయణ ప్రారంభించారు. అప్పటికి పత్రికారంగం, సాహిత్యం, సినీ విశ్లేషణల్లో పేరుతెచ్చుకుని, కొత్తగా వెండితెర నవలలు రాస్తున్న [[ముళ్ళపూడి వెంకటరమణ]]ని ఒప్పించి కథారచయితగా తీసుకువచ్చారు డి.బి.ఎన్. అయితే అప్పటికి బిజీ డైరెక్టరుగా, వరుస విజయాలతో సాగుతున్న ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ముళ్ళపూడి వెంకటరమణతో కబుర్లే తప్ప కథాచర్చలకు దిగలేదు ఆదుర్తి. ఈలోగా [[గుడిగంటలు]], [[రక్తసంబంధం (1962 సినిమా)|రక్తసంబంధం]] సినిమాలకు రచయితగా రమణకు అవకాశం వస్తే చాలా సంతోషించి డి.బి.ఎన్. పనిచేయమన్నారు. అవి విడుదలై విజయవంతమయ్యాయి, ఇక దాగుడు మూతలు సినిమా పని ప్రారంభిద్దామనే సరికి ఆదుర్తి దాన్ని పక్కనపెట్టి [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] లైన్ చెప్పి స్క్రిప్ట్ అభివృద్ధి చేయమన్నారు. మూగమనసులు సినిమా నిర్మాణం నారాయణనే చేయమని, అవసరమైతే రామారావునే హీరోగా పెట్టుకుందామని, ఈ సినిమాని అప్పటికి వదిలేద్దామని ప్రతిపాదించారు ఆదుర్తి. అయితే మూగమనసులు సినిమా ప్రధానంగా అవుట్-డోర్ లో గోదావరి పరిసరాల్లో షూటింగ్ ఉంటుందనీ, రామారావు అవుట్-డోర్ షూటింగులు చేయట్లేదని, తాను డేట్లిచ్చి కమిటైన రామారావును వదిలి మరొకరితో చేయనని తిరస్కరించారు నారాయణ. దాగుడుమూతలు తర్వాత తీయొచ్చు కానీ ఎఎన్నార్ తోనే మూగమనుసులు తీయమని ప్రోత్సహించారు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1568986" నుండి వెలికితీశారు