"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
1961లో [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో [[ఎన్టీ రామారావు]] కథానాయకునిగా దాగుడుమూతలు సినిమా తీద్దామని నిర్మాత డి.బి.నారాయణ ప్రారంభించారు. అప్పటికి పత్రికారంగం, సాహిత్యం, సినీ విశ్లేషణల్లో పేరుతెచ్చుకుని, కొత్తగా వెండితెర నవలలు రాస్తున్న [[ముళ్ళపూడి వెంకటరమణ]]ని ఒప్పించి కథారచయితగా తీసుకువచ్చారు డి.బి.ఎన్. అయితే అప్పటికి బిజీ డైరెక్టరుగా, వరుస విజయాలతో సాగుతున్న ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ముళ్ళపూడి వెంకటరమణతో కబుర్లే తప్ప కథాచర్చలకు దిగలేదు ఆదుర్తి. ఈలోగా [[గుడిగంటలు]], [[రక్తసంబంధం (1962 సినిమా)|రక్తసంబంధం]] సినిమాలకు రచయితగా రమణకు అవకాశం వస్తే చాలా సంతోషించి డి.బి.ఎన్. పనిచేయమన్నారు. అవి విడుదలై విజయవంతమయ్యాయి, ఇక దాగుడు మూతలు సినిమా పని ప్రారంభిద్దామనే సరికి ఆదుర్తి దాన్ని పక్కనపెట్టి [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] లైన్ చెప్పి స్క్రిప్ట్ అభివృద్ధి చేయమన్నారు. మూగమనసులు సినిమా నిర్మాణం నారాయణనే చేయమని, అవసరమైతే రామారావునే హీరోగా పెట్టుకుందామని, ఈ సినిమాని అప్పటికి వదిలేద్దామని ప్రతిపాదించారు ఆదుర్తి. అయితే మూగమనసులు సినిమా ప్రధానంగా అవుట్-డోర్ లో గోదావరి పరిసరాల్లో షూటింగ్ ఉంటుందనీ, రామారావు అవుట్-డోర్ షూటింగులు చేయట్లేదని, తాను డేట్లిచ్చి కమిటైన రామారావును వదిలి మరొకరితో చేయనని తిరస్కరించారు నారాయణ. దాగుడుమూతలు తర్వాత తీయొచ్చు కానీ ఎఎన్నార్ తోనే మూగమనుసులు తీయమని ప్రోత్సహించారు. ఇలా ఆలస్యం కావడంతో చివరకు కథాచర్చలు దశ పూర్తయ్యేసరికే ప్రాజెక్టు ప్రారంభించి మూడేళ్ళు దాటింది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1568988" నుండి వెలికితీశారు