రక్తసంబంధం (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
తమిళంలో [[శివాజీ గణేశన్]], [[జెమినీ గణేశన్]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా ''పాశమలర్''. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత [[డూండీ]] తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన [[ముళ్ళపూడి వెంకటరమణ]]ను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం "హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు" అంటూ ప్రోత్సహించారు. అలా ముళ్లపూడి వెంకటరమణ రచనలో స్క్రిప్ట్ పూర్తైంది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref><br />
తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు [[వి.మధుసూదనరావు]] స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
 
==పాటలు==