రక్తసంబంధం (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
=== అభివృద్ధి ===
తమిళంలో [[శివాజీ గణేశన్]], [[జెమినీ గణేశన్]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా ''పాశమలర్''. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత [[డూండీ]] తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన [[ముళ్ళపూడి వెంకటరమణ]]ను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం "హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు" అంటూ ప్రోత్సహించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref><br />
తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు [[వి.మధుసూదనరావు]] స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఆశ్చర్యానందాలకుఒకేసారి లోనయ్యారుస్క్రిప్ట్ చూసి ఓకే చేసేశారు.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరుకొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref>
 
==పాటలు==