కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
అది 1974 వ సంవత్సరం కడిమిళ్ళ జీవనమార్గాన్ని నిర్దేశించింది. అక్కడనుండి తాను ప్రతిరోజు పద్యాలు రాసి అందరకు చూపిస్తూ ఉంటే అంత చిన్న వయస్సులో పద్యాలు రాస్తున్నందుకు అందరూ ఆశ్చర్యంలో ఉబ్బి తబ్బిబ్బు అయ్యేవారు. రాసిన ప్రతి పద్యం శ్రీ ఉపద్రష్ట రామలింగస్వామి దిద్దేవారు. అందుకే ఆయనను తొలి గురువుగా కడిమిళ్ళ ప్రకటించారు.
 
కె.కోటారావుగారు అనే ఆంధ్రోపన్యాసకులు శ్రీ కడిమిళ్ళకు ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. తరగతిగదిలోనే ఆశువుగా ఒక పాదం చెప్పి మిగిలిన మూడు పాదాలు కడిమిళ్ళను పూర్తి చేయమనేవారు. ఈ విధంగా అశువును బాగా అలవాటు చేసింది కోటారావుగారే. కళాశాల వార్శికోత్సవం సందర్భంగా మొదటి సంవత్సరం, చివరి భాగంలో (1975) ఆనాటి సుప్రసిద్ధ అవధానులు కొవ్వూరు సంస్కృత కళాశాల ఆంధ్రోపన్యాసకులు, మధురకవి, అవధాన శేఖరులు అంటే ఏమిటో తెలియని కడిమిళ్ళకు ఆ అవధానం చూడగానే తనకు కూడా అవధానం చేయాలనే కోరిక అంకురించింది. అంకురించినదే తడవు విడివిడిగా అన్ని అంశాలు అభ్యాసం చేసి భాషాప్రవీణ రెండో సంవత్సరంలో (1976) తొలి అష్టావధానానికి కొందరి విద్యార్ధులను మాత్రం కూడగట్టుకుని ఉపాద్యాయులు లేకుండా ప్రయోగాత్మకంగా అవధానం చేసి సఫలీకృతులయ్యారు. ఈ సంగతి విన్న కోటారావుగారికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా ఉదయించి వారిచ్చే ప్రోత్సాహాన్ని ద్విగుణీకృతం చేసారు. విద్యార్ధి దశలో ఉండగానే మండపేట, పెనుగొండ, నూజివీడు మొదలయిన ప్రాంతాలలో అవధాన ప్రదర్శనలు ఇచ్చి వార్తా పత్రికలకు ఎక్కి చిన్నవయస్సులోనే అవధానిగ ప్రాచుర్యాన్ని పొందడం కడిమిళ్ళలో గల విశేషం. అంతేకాదు పొడగట్లపల్లి కళాశాల స్థాపించిన తరువాత అవధానం చేసిన మొదటి విద్యార్ధిగా గుర్తింపు పొందారు.<ref>{{cite web|title=జీవనరేఖలు|url=http://www.kadimilla.com/jeevanarekalu.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు