కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==అవథాన గురువుగా==
ఎంతోమందిని కవులు, అవధానులుగా తీర్చిదిద్ది తగిన ప్రోత్సాహాన్నందిస్తూ, వారి ప్రథమ కుమారుడు రమేష్ ని కూడా కవిగా తీర్చిదిద్దారు. ఆయన అనేక మంది పండితులను అవథానులుగా తీర్చిదిద్దారు. వారిలో [[కోట వెంకట లక్ష్మీనరసింహం]] , [[అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు]] , [[వద్దిపర్తి పద్మాకర్]] , [[మరడాన శ్రీనివాసరావు]]. అదే విధంగా మంకు శ్రీను అనే శిష్యుడు తోలేటి పార్ఢసారధి అనే మరొక శిష్యుడు కడిమళ్ళవారి ప్రేరణతో కొన్ని శతకాలు రచించి ప్రచురించారు.శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి, శ్రీ భాగవతులు, కొన్ని కృతులను రచించి ప్రచురించుటం జరిగింది.<ref>{{cite web|title=అవధాన గురువుగా|url=http://www.kadimilla.com/guruvuga.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
==అవథాన ప్రస్థానం==
* 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు శృంగేరీ పీఠాధిపతి జగర్గురు భారతీ తీర్ధస్వామి నల్లకుంటలోని శంకరమఠంలో శతావధానం.మూడురోజుల పాటు సాగిన ఆనాటి శతావధానంలో సర్వశ్రీ కేశవ పంతుల సరసింహాశాస్త్రి, పుల్లెల శ్రీరామచంద్రుడు, శ్రీ పేరాల భరతశర్మ, శలాక రఘనాథశర్మ వంటి ఉద్దండులు పృచ్చకులుగా కూర్చోవడమేకాక ప్రతీ ప్రయోగాన్ని సునిశితంగా గమనించారు.
* 1985 నవంబరు నెలలో విజయవాడ లబ్బీపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో భువనవిజయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆనాడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమానంద భారతి అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతీ కంఠాభరణ డా||ప్రసాద రామకులపతి సంచాలకులుగా ఉన్నారు. కడిమిళ్ళవారి అవధాన గురువులయిన శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. విజయవాడలో కూడా 50 సమస్యలు 50 వర్ణనలు పూర్తిచేసి నూటికి నూరు ధారణ చేయగా అశేష ప్రజానీకం ఎంతో ఆనందించింది.
* తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో త్రివేణి ఆధ్వర్యంలో మృగశీర్ష వెంకటరమణమూర్తి, ద్వాదశి నాగేశ్వర శాస్త్రి, కందుకూరి పుండరీకాక్షులు మొదలగువారి నేతృత్యంలో రావూరి వేంకటేశ్వర్లుగారి సంచాలకత్వంలో ఉషశ్రీ అప్రస్తుతంతో ఒక శతావధానం నిర్వహించారు. ఈ శతావధానంలో సమస్యలు 25, దత్తపదులు 25, వర్ణనలు 25, ఆశువులు 25, అనే పద్దతిని స్వీకరించి 75 పద్యాలను ధారణచేశారు.
* రాజమండ్రిలో కందుకూరి విరేశలింగం టౌనుహాలులో బేతవోలు రామబ్రహ్మంగారి సంచాలకత్వంలో సాయంకాలం 5:00 గంటలకు ప్రారంభించి, రాత్రి 10:00 గంటలకు ఒకే శతావధానం నిర్వహించి సభ్యులను ఆశ్చర్యపరిచారు.
* 1992 నవంబరు 14,15 తేదీలలో పెద్దాపురంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఫిబ్రవరి 11,12 తేదీలలో కీ||శే|| కొమ్మూరి శేషగిరి రావుగారు (గాంధీ) శ్రీ గోపాల శ్రీనివాసరావు, శ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు మొదలగువారి నేతృత్వంలో శ్రీ గరికిపాటి నరసింహారావు సంచాలకత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్య కళామందిరంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఏప్రియల్ 1,2 తేదీలలో యువనామ సంవత్సరము సందర్భంగా న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో బెనర్జి - గుమ్మి వెంగళరెడ్డిగార్ల ఆధ్వర్యంలో చక్రావధానుల కేశాప్రగడ రెడ్డప్ప ధచేజీగారి ఆర్డినేషన్ లో శతావధానం జరిగింది.
* 1995 జూలై 8,9 తారీకులలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాటి శాసనసభ్యులు శ్రీ వి.వి.ఎస్.చౌదరిగారి నేతృత్యంలో శ్రీ పున్నమరాజు ఉమమహేశ్వరరావు మొదలగు వారి కార్యనిర్వహణలో ప్రసాదరాయ కులపతి మరియు బేతవోలు రామబ్రహ్మంగార్ల సంయుక్త సంచాలకత్వంలో శతావధానంలో సంస్కృతం నుండి తెలుగునకు, తెలుగునుండి సంస్కృతానికి అనువాదాలను కూడా నిర్వహించి మెప్పు పొందారు.
* 1996 మే 29,30,31 మరియు జూన్ 1,2,3 తేదీలలో అనగా ఆరురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డా||కడిమిళ్ళ ద్విశతావధానాన్ని నిర్వహించి తన సామర్ధ్యాన్ని ప్రకటించుకున్నారు.
* 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
* 2001 ఆగష్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
* 2002 నవంబరు 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడేంలో తెలుగు సాహిత్య సమాఖ్య మరియు శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన జంటకవుల శతావధానం
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు