కథానాయకుడు (1969): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== రీమేక్స్ ==
కథానాయకుడు సినిమా తమిళ, హిందీ భాషల్లో పునర్నిర్మితమై విజయవంతమైంది. 1969లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలన్న ఆలోచనతో ఉన్న [[ఎం.జి.రామచంద్రన్]] ప్రజలు దాన్నెలా స్వీకరిస్తారోనన్న సందేహంతో ఉన్నారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డిని[[నాగిరెడ్డి]]ని రాజకీయ సంబంధమైన చిత్రాన్ని నిర్మించమని కోరారు. దాంతో తెలుగులో విజయవంతమైన [[కథానాయకుడు]] సినిమాను సూచించగా దాన్ని అంగీకరించి తమిళంలో ''నమ్‌నాడు'' పేరిట [[ఎం.జి.రామచంద్రన్]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[ఎస్.వి. రంగారావు]] ప్రధాన పాత్రల్లో [[బి.నాగిరెడ్డి]], [[చక్రపాణి]] నిర్మించారు. ''నమ్‌నాడు'' చిత్ర విజయం, మరీ ముఖ్యంగా ఎంజిఆర్, నాగిరెడ్డి మేఖలా థియేటర్లో సినిమా చూసేప్పుడు దురై(ఎం.జి.రామచంద్రన్) మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాకా అలిమేలు(జయలలిత) విజయగీతం ఆలపించడాన్ని ప్రజలు ఆస్వాదించడం, ఆ పాట మళ్ళీ వేయాలని గొడవపెట్టి మరీ వేయించుకుని చూడడం వంటివి, రామచంద్రన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రజామోదం ఉన్నట్టు నమ్మకం కలిగించాయి. తర్వాత ఆయన [[తమిళనాడు శాసనసభకుశాసనసభ]]కు అతిగొప్ప మెజారిటీతో ఎన్నికై సంచలనం సృష్టించారు. ''నమ్‌నాడు''కు దర్శకత్వం వహించిన సి.పి.జంబులింగాన్నే దర్శకునిగా పెట్టుకుని ఇదే సినిమాను హిందీలో ''అప్నా దేశ్'' పేరిట పునర్నిర్మించారు. అప్నా దేశ్ సినిమాలో [[రాజేశ్ ఖన్నా]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[ఓంప్రకాష్]] ప్రధాన పాత్రలు ధరించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" /> <ref name="నమ్ నాడు గురించి హిందూలో">{{cite news|title=స్మాల్ ట్రిబ్యూట్ టు ఎ బిగ్ లెజెండ్|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/a-small-tribute-to-a-big-legend/article5994347.ece|accessdate=29 July 2015|work=ది హిందూ|date=10 మే 2014}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/కథానాయకుడు_(1969)" నుండి వెలికితీశారు