"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

 
=== చిత్రీకరణ ===
పులిదిండి గ్రామంలో ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు తీసిన తొలి చిత్రం [[సాక్షి (సినిమా)|సాక్షి]] చిత్రీకరణ సాగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పని పూర్తిచేసి, ఫైనాన్సు చేసేందుకు నవయుగ వారిని ఒప్పించగానే బాపురమణలు ఓ మ్యాప్ గీసుకున్నారు. సినిమాలో అనుకున్న గ్రామం ఎలావుంటుంది అన్న మ్యాప్ అది. అందులో బల్లకట్టు ఉన్న ఓ కాలవ, కాలవ దగ్గర రేవులో ఓ పెద్ద మర్రిచెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్ళో ఓ చిన్న గుడి, గుడికో మండపం.. ఇలా తమ సినిమా కథకు అవసరమైన పల్లెటూరిని మ్యాప్ గా గీశారు. గోదావరి పరిసరాల్లో ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేసి అప్పటికి సీలేరు ప్రాజెక్టు ఇంజనీరుగా పనిచేస్తున్న బాపు రమణల బాల్యమిత్రుడు, రచయిత [[బి.వి.ఎస్.రామారావు]]ను ఆ మ్యాప్ ని పోలిన ఊరు వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవుపెట్టి అలాంటి ఊరి కోసం రాజమండ్రి వచ్చేసి ఇరిగేషన్ కాంట్రాక్టర్ గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజుకు అలాంటి ఊరిని వెతుకుదాం సాయపడమని అడిగారు. ఆ మ్యాప్ చూసినాకా మ్యాపును పోలినట్టుగా తమ ఊరు పులిదిండే ఉందని సూచించారు. వెనువెంటనే బాపురమణలు వచ్చి ఆ ఊరిని చూసి ఓకే చేశారు.<br />
సినిమాకు అవసరమైన కొన్ని సెట్లు [[బి.వి.ఎస్.రామారావు]] వేశారు. ఈ సెట్ ఎంత సహజంగా కుదిరేలా ప్రయత్నించారంటే సినిమాలో కథానాయకుడి గుడిసె సెట్ వేసినప్పుడు, దాన్ని పాతబడిన ఇల్లుగా చూపేందుకు గ్రామంలోని పాతబడిపోయిన పాడైన గుమ్మం ఆ ఇంటివారిని అడిగి తీసుకుని వినియోగించారు. అలానే ఆ గుమ్మాన్నిచ్చిన వారికి కొత్త గుమ్మాన్ని ఏర్పాటుచేశారు. ఈ సినిమా చిత్రీకరించేందుకు ముందు బాపుకు సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవమేదీ లేదు. కేవలం సినిమా విద్యార్థిగా, ఔత్సాహికునిగా ప్రారంభమై ఎవరి వద్దా అసిస్టెంటుగా పనిచేయకుండానే సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయనకు షాట్ తీసే విధానాల గురించి కొంత మౌలికమైన విషయాలను [[ఆదుర్తి సుబ్బారావు]] అసిస్టెంటుగా పనిచేసిన కబీర్ దాస్ నేర్పారు. సినిమాలో మొదట ''అమ్మకడుపు చల్లగా అత్తకడుపు చల్లగా'' పాట చిత్రీకరణతో ప్రారంభించి దాదాపు 19రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలైంది.<ref name="మా సినిమాలు-బాపు">{{cite web|first1=బాపు|title=మా సినిమాలు|url=http://navatarangam.com/2014/02/our-films-bapu-1/|website=నవతరంగం|accessdate=18 April 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1571112" నుండి వెలికితీశారు