వాడుకరి చర్చ:Veera Narayana: కూర్పుల మధ్య తేడాలు

1,663 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
ఇంగ్లీష్ వికీపీడియాలో సినిమాల పేజీలు, మీ కృషి గమనిస్తూంటే అక్కడి గుడ్ ఆర్టికల్, ఫీచర్డ్ ఆర్టికల్ వంటి విభాగాలు, వాటి నియమాలు వంటివాటిపై మీకు లోతైన అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. తెవికీలో పుస్తకాల గురించిన పేజీల్లో నేను కృషిచేసి ఏకరూపత్వానికి, అతిశయోక్తులను పరిహరించే శైలికీ మాత్రమే కాక కంటెంట్ పరంగా కూడా చాలా కృషి చేశాను. సినిమాల పేజీలను అభివృద్ధి చేయాలని నేను ప్రస్తుతం భావిస్తున్నాను. కానీ నాకు ఏ మార్గమూ తెలియట్లేదు. ఇప్పటికే ఉన్న ఆంగ్లవికీ పేజీలు చూసి తెలుసుకుందామంటే వాటిలోని చాలా టెక్నికల్ పదాలకు తెలుగు తోచట్లేదు. అనువాదాలు కాక ఒరిజినల్ కృషి చేద్దామని నా భావన. మీరేదైనా ఓ మార్గం చూపితే బావుంటుంది. నేను రెగ్యులర్ గా తెలుగు సినిమాలకు సంబంధించిన కబుర్లే కాక సాంకేతికంగా సినిమాల గురించి రాసిన విశేషాలు కూడా చదువుతుంటాను. ప్రతి తెలుగు పత్రికల్లో పాత తెలుగు సినిమాల గురించి 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వ్రాస్తున్న వ్యాసాలు సేకరిస్తున్నాను. కానీ మీరు నాతో తెలుగు సినిమాలపై తెలుగు వికీలో కొద్దిరోజులు సమిష్టి కృషి చేస్తే నాకు అవగాహన కలుగుతుందని భావిస్తూన్నాను. మీరేమైనా సాయం చేయగలరా?--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:48, 8 ఫిబ్రవరి 2015 (UTC)
:: [[వాడుకరి:Pavanjandhyala|పవన్ జంధ్యాల గారూ]] చిన్న అభ్యర్థన తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాల గురించి రాసేప్పుడు సందేహాలు వస్తున్నాయి. వాటి మూలచిత్రాలు చాలా ప్రఖ్యాతి పొందినవి, కనుక వాటికీ పేజీలు సృష్టిస్తే బావుంటుందా? ఉదాహరణకు నాయకుడు సినిమా తీసుకుంటే అది తమిళ డబ్బింగ్. మూలచిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పేరుపొందింది, టైమ్స్ మేగజైన వారి 100 సినిమాల జాబితాలో చేరింది. ఆ వివరాలన్నీ నాయకుడు సినిమా పేజీలో ఏం ఇస్తాం. అందుకోసం విడిగా నాయగన్ సినిమా పేజీ సృష్టించుకుంటే బావుంటుందా? ఒకవేళ అలాచేస్తే రెండు సినిమాల్లో అత్యధిక వివరాలు ఒకటే అయి కవల వ్యాసాలు తయారవుతాయేమో? ఇలాంటి సందేహాలతో ఉన్నాను. ఇంగ్లీషులో మీరేం చేస్తున్నారీ విషయంలో? పాలసీలు, గైడ్లైన్లు ఏమైనా ఉన్నాయా?--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:59, 11 ఏప్రిల్ 2015 (UTC)
 
== అభివృద్ధి చేస్తున్న వ్యాసాల్లో సూచనల కోసం ==
 
పవన్ గారూ, ఇటీవల కొన్ని సినిమా వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నాను. ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ, పరుచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి రాసిన వ్యాససంకలనం, జంధ్యాల సినిమాల గురించి పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం వంటివి సోర్సులుగా వాడుకుంటున్నాను. అయితే నేను అవసరమైన సమాచారాన్నే చేరుస్తున్నానా, సరిగానే శీర్షికలు విభజిస్తున్నానా లాంటి అనుమానాలు ఉన్నాయి. ఒకసారి [[మూగ మనసులు (1964 సినిమా)]], [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]], [[రెండుజెళ్ళ సీత]], [[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]] వంటివి చూసి సూచనలు చెప్పగలరా? --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:44, 31 జూలై 2015 (UTC)
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1571153" నుండి వెలికితీశారు