అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

జన్మ సమాచారం
→‎కళాపోషణ: ఇంకొక మూలం
పంక్తి 49:
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి<ref name=act4>సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం) - ఆరుద్ర పేజీ.14,15</ref>. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు<ref name=act2>వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము) </ref>. ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె ''మారిచీపరిణయం'' వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి<ref name=act4>సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం) - ఆరుద్ర పేజీ.14,15</ref>.
 
అచ్యుత రాయలు స్వయంగా మంచి [[వీణ|వీణా]] విద్వాంసుడు కూడా<ref>''Vijayanagara'' by Vasundhara Filiozat, National Book Trust, 1999, పేజీ.50-51</ref>. ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ ''అచ్యుతభూపాళీ వీణ'' గా పేరొందినది<ref name=act1>http://www.veenavidhya.com/veena.shtml</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు