మూగ మనసులు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ చాలాభాగం అవుట్-డోర్‌లో జరిగింది. [[గోదావరి నది|గోదావరి తీరంలో]] ఉన్న పల్లెటూళ్ళో కథ సాగడం, అదీ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు ప్రధానంగా గోదావరిపైన బల్లకట్టు మీద కావడంతో షూటింగ్ కోసం పెద్ద లాంచీలు, 6*15 అడుగుల కొలతలతో ఉండే పంట్ లు, పెట్రోల్ బోట్, విక్టోరియా స్టీమర్ లతో కలిపి భారీ నౌకాదళం వినియోగించారు. నౌకల్లో, బోట్లలో ప్రయాణం చేస్తూ [[భద్రాచలం]] లో ప్రారంభించి [[ధవళేశ్వరం]] వరకూ చిత్రీకరణ చేశారు. వాటి మీదే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బస ఏర్పాటుచేసి ప్రయాణం చేస్తూన్నప్పుడు దర్శకుడికి ఎక్కడ నచ్చితే ఆ లొకేషన్లో ఆపి చిత్రీకరణ జరిపేవారు.<br />
సినిమాలోఅయితే చిత్రీకరణకు ముందు సినిమా అవుట్ డోర్ షూటింగ్ అయితే నాగేశ్వరరావు, సావిత్రిలాంటి స్టార్స్ తో జనాన్ని కంట్రోల్ చేయలేమనీ గోదావరి మీద సినిమా వద్దనీ సహనిర్మాత సుందరం అడ్డుపడ్డారు. ఆఖరి నిమిషంలో మొదట అనుకున్నట్టే గోదావరి పరిసరాల్లోనే అవుట్-డోర్లో సినిమా తీసేందుకే సిద్దపడ్డారు. క్లైమాక్స్ సన్నివేశంలో హీరోహీరోయిన్లు ప్రమాదవశాత్తూ చనిపోతే విషాదాంతం అవుతుందిచనిపోతారు. ఆ సన్నివేశం వరదల్లో ఆనకట్ట వద్ద నీటి ఉధృతితో సుడిగుండాలు ఏర్పడగా కొట్టుకునిపోయినట్టు, హీరోహీరోయిన్లు అందులోనేప్రయాణిస్తున్న నావ దాంట్లో పడి కొట్టుకుపోయేట్టు, వారు ఉండివరదలో మరణించినట్టూ రాశారు రచయిత రమణ. ఆ సన్నివేశాన్ని రాసేప్పుడు అందుకు తగ్గ వాతావరణాన్ని, ఆనకట్ట, వరదాకాలం వంటి విషయాలను రమణ బాల్యమిత్రుడు, అప్పటికి గోదావరి ప్రాంతంలో నీటిపారుదల శాఖలో ఇంజనీరింగు విభాగంలో పనిచేస్తున్న [[బి.వి.ఎస్.రామారావు]] సూచించారు. అయితే చిత్రీకరణ ప్రారంభమవుతుండగా ముళ్ళపూడి ఆ విషయాన్ని బి.వి.ఎస్.రామారావుకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పటికి వరదలు కొనసాగుతున్నాయి, మరో వారం పదిరోజుల్లో వరద తగ్గిపోతే షట్టర్లు ఎత్తేస్తారు. మళ్ళీ ఆ వరదను చిత్రీకరించాలంటే సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందే. ఆ విషయాన్ని రామారావు ముళ్ళపూడి వెంకటరమణకి ఫోన్ చేసి చెప్పడంతో, ఆదుర్తితో మాట్లాడి మరో మూడురోజుల్లో ఆదుర్తి, ముళ్లపూడి, కెమెరామాన్ పి.ఎల్.రాయ్, డూపులు తదితరులు వచ్చారు. పిచుకల లంకలో షూటింగ్ చేశారు. డూపులను నించోబెట్టిన నావ ఆనకట్ట వరకూ చేరడం లాంగ్ షాట్ లో చిత్రీకరించి, తర్వాతి షాట్లో డమ్మీలతో నావ సుడిలో ఆనకట్ట వద్ద పడేలా వదిలి ఆ ప్రమాదాన్ని చిత్రీకరించారు. అలా సినిమా క్లైమాక్సుతోనే చిత్రీకరణ ప్రారంభించింది.<ref name="కొసరుకొమ్మచ్చి - సీతారాముడు">{{cite book|author1=బి.వి.ఎస్.రామారావు|authorlink1=బడి నుంచి బైస్కోపుల దాకా.. రమణతో నా ప్రయాణం|title=కొసరుకొమ్మచ్చి|date=అక్టోబర్ 2014|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=3}}</ref><br />
సినిమా చిత్రీకరణలో ఒకసారి కథానాయిక [[సావిత్రి (నటి)|సావిత్రికి]] ఘోర ప్రమాదం జరిగింది. ఈ నాటి ఈ బంధమేనాటిదో పాటకి ఐ.ఎల్.టి.డి పెట్రోల్ బోటులో చిత్రీకరణ జరుగుతోంది. గంటకు పదికిలోమీటర్ల వేగంతో ఆ బోటును ఆనకట్ట దగ్గర నడిపిస్తున్నారు. ఆ బోటుపై సావిత్రి, నాగేశ్వరరావు ఉన్నారు. వేరే బోటుమీద కెమెరా, డైరెక్టరు తదితరులు ఉండి చిత్రీకరణ జరుపుతున్నారు. సావిత్రి ఒక షాట్లో బోటుపై ఉన్న జెండా కర్ర పట్టుకుని వయ్యారంగా వెనక్కి వాలింది. హఠాత్తుగా ఆ కర్ర విరిగిపోగా సావిత్రి నడి గోదారిలో పడిపోయింది. ఈ హడావుడిలో ఆమె చీర బోటుకింద ఉండే మోటారుచక్రంలో ఇరుక్కుని లుంగచుట్టుకుపోయింది. ఆమె బోటు అంచును చేత్తోపట్టుకుంది, బోటు ఆనకట్ట వైపుకు వెళ్తోంది. అక్కడికి వెళ్తే సావిత్రి జలపాతంలో పడికొట్టుకుపోతుంది. ఈలోగా నాగేశ్వరరావు చేయందిస్తూ పట్టుకోమంటున్నాడు. గట్లపై వేలమంది జనం, తానేమో చీర జారిపోయివుంది, దాంతో సావిత్రి సిగ్గు, భయంతో రావట్లేదు. ఆ స్థితిలో లాంచిడ్రైవర్ సింహాచలం దాన్ని ఆపేందుకు రివర్స్ గేర్ వేశారు. సమస్య అర్థం చేసుకున్న నాగేశ్వరరావు బోటులోని కాన్వాస్ గుడ్డ ఆమెకు అందించగా చుట్టుకుంది, ఇంతలో లాంచివాళ్ళూ, ఈతగాళ్ళూ చుట్టూ తమ తలగుడ్డలు అడ్డుపెట్టి నుంచోగా నాగేశ్వరరావు చేసాయంతో పెకెక్కారు. దాంతో పెనుప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటన జరగడంతో సావిత్రి చాన్నాళ్ళు గోదావరి పరిసరాల్లో అవుట్-డోర్ షూటింగుల్లో నటించలేదు. ఆశ్చర్యకరంగా చాన్నాళ్ళకు జరిగిన మరోసినిమా షూటింగులోనూ ప్రమాదం జరిగి సావిత్రి కొద్దిలో తప్పించుకున్నారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />