దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
 
ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ([[రాజ్ కపూర్]] [[హిందీ]] సినిమా 'మేరా నామ్ జోకర్' మొదట 4 గంటల 24 నిముషాలు గాని తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి). 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యిందంటఅయ్యింది.
 
 
పంక్తి 38:
 
 
ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఈ చిత్రానికి మాటలు అందించిన కొండవీటి వెంకట కవి కి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు.
 
ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, రామ్ రహీమ్ (బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించిన చివరి చిత్రం ఇది. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు.
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు