దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఈ చిత్రానికి మాటలు అందించిన కొండవీటి వెంకట కవి కి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు.
 
ఈ సినిమాలో అర్జునునిగా [[నందమూరి హరికృష్ణ]], అభిమన్యునిగా [[నందమూరి బాలకృష్ణ]] నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ [[తాతమ్మకల]] చిత్రం లోనూ, రామ్ రహీమ్ (బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించిన చివరి చిత్రం ఇది. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు. బాలకృష్ణ, హరికృష్ణ లకు మేకప్ ఎన్టీఆర్ చేసేవారు.
 
[[చలపతిరావు]] ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర మిగతా రెండు అతిధి పాత్రలు.
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు