వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఒక ప్రక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలొ జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాధమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు.పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు.అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాధ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.
 
[[ఉప్పు సత్యాగ్రహం]] నుఉద్యమంను విశాఖపట్నంలో నిర్వహించే భాద్యతను బులుసు సాంబమూర్తి అప్పచెప్పినపుడు ఆ భాద్యతను చక్కగా నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా [[నౌపడ]] లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20 న అరెస్ట్ అయ్యారు.ఫలితంగా [[రాయవెల్లూరు]] లొ 6 నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 1931 లొ [[ఇచ్చాపురం]] లో జరిగిన గంజాం జిల్లా మహిళాసభకు అద్యక్షత వహించారు. 1932 లో [[శాసనోల్లంఘనఉప్పు సత్యాగ్రహ ఉద్యమం]] తీవ్రదశలో ప్రభుత్వం కాంగ్రెసు సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు ప్రకటించిన చోటులో కాకుండా వేరొక చోటులో కాంగ్రేసు సమావేశాలు జరిగేవి. ఆ పద్దతిలో వేదాంతం కమలాదేవి [[గుంటూరు]] లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభ ను తెల్లవారుజామున ప్రకటించిన ప్రకారమే నిర్విఘ్నంగా జరిపి తన అద్యక్షతన తీర్మానాలు అమోదించారు. మళ్ళీ రెండవసారి రాయవెల్లూరులో 6 నెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంది విదుదలైన తరువాత తన ఆరోగ్యం సహకరించకున్నా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రేసు ప్రచారం చేసారు. 1935 చట్టం ప్రకారం 1937 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్దుల విజయానికి ఎంతో కృషి చేసారు.
 
ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగేసు స్థాయి సంఘ సభ్యులుగా వున్నారు. మూడుసార్లు కాకినాడ మున్సిపల్ కౌన్సిలర్ గా వున్నారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు