వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆమె [[1897]] [[మే 5]] వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్య తో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]] లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది.
==స్వాతంత్ర్యోద్యమంలో..==
1920 లో [[కాకినాడ]] లో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు. దేశ బాందవి [[దువ్వూరి సుబ్బమ్మ]] గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసలను పొందారు. 1923 లో కాకినాడలో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు మహర్షి [[బులుసు సాంబమూర్తి]] ప్రొత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశెషసేవలు అందించారు<ref>[https://books.google.co.in/books?id=5dqRvDui1-4C&pg=PA71&lpg=PA71&dq=vedantam+kamaladevi&source=bl&ots=y1DI5gDZrx&sig=aSMTsWwj8nEYC4sdw7I_nrXGnM0&hl=te&sa=X&ved=0CB4Q6AEwAGoVChMIt8KqyqCKxwIVRAqOCh3N-wHL#v=onepage&q=vedantam%20kamaladevi&f=false salt satyagraha in the costal andhra districts]</ref>.
 
ఒక ప్రక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలొ జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాధమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు.పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు.అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాధ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు