ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6:
== ఉద్యమ ప్రస్థానం ==
సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించారు. 1943 సంవత్సరంలో 15ఏళ్ళ వయసులోనే అన్న రాజిరెడ్డితో కలిసి [[ఖమ్మం]] [[ఆంధ్రమహాసభ]] కు హాజరయ్యింది. తెలంగాణ సాయుధపోరాట యోధులు కీ.శే. [[బొమ్మగాని ధర్మభిక్షం]], [[భీమిరెడ్డి నరసింహారెడ్డి]], దాయం రాజిరెడ్డిలతో కలిసి [[సూర్యాపేట]] ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు.
ప్రియంవద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. అన్న, వదినలతో పాటు [[భువనగిరి]] లో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియంవద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది. 1952లో జరిగిన ఎన్నికల్లో [[నల్లగొండ]] జిల్లాలో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్యవివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు. మహిళల కూలీరేట్ల పెంపు కోసం ఆమె రాజీలేని పోరాటం సాగించి, పెద్ద రైతు కుటుంబ నేపథ్యం కలిగిఉన్నఅర్ధశేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీని, రెండుశేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు.
పంక్తి 12:
యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత పట్టుబడ్డ ప్రియంవదను సికిందరాబాద్ మిలిటరీ క్యాంపులో మూడు మాసాలపాటు నిర్బంధించారు. నల్లగొండ, ఖమ్మం, [[వరంగల్]] జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
ఆంధ్రమహాసభలు వరంగల్, ఖమ్మంలో జరిగిన తర్వాత అన్న రాజిరెడ్డిను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న రాజిరెడ్డికి తోడుగా [[కొలనుపాక]] జైన మందిరంలో నడిపే స్కూలులో యాభై రూపాయల జీతంతో టీచర్‌గా చేరారు. అక్కడ ఒక సంవత్సరంపాటు పనిచేశారు. ఆసమయంలో వీరి కుటంబంపై ప్రభుత్వం నిషేదం విధించడంతో 1944లో విజయవాడ కి వెళ్లారు. అక్కడ జరిగిన అఖిలభారత కిసాన్ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు.
== మరణం ==
|