ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
ఆంధ్రమహాసభలు వరంగల్, ఖమ్మంలో జరిగిన తర్వాత అన్న రాజిరెడ్డిను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న రాజిరెడ్డికి తోడుగా [[కొలనుపాక]] జైన మందిరంలో నడిపే స్కూలులో యాభై రూపాయల జీతంతో టీచర్‌గా చేరారు. అక్కడ ఒక సంవత్సరంపాటు పనిచేశారు. ఆసమయంలో వీరి కుటంబంపై ప్రభుత్వం నిషేదం విధించడంతో 1944లో విజయవాడ కి వెళ్లారు. అక్కడ జరిగిన అఖిలభారత కిసాన్‌ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ గ్రామాలకు వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆడవాళ్లలో చైతన్యం కలిగించింది.
 
సూర్యాపేటలో భక్తవత్సలాపురం, అనాసపురం, దురాసపల్లి, రాయపాడు గ్రామాలల్ల తిరిగి, ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలె ? స్త్రీలకు స్థావరాలు కొన్ని తెలిసున్నా చెప్పకుండా ఎట్లుండాలె? కారం చల్లటానికి ఎట్ల సిద్ధమవ్వాలి, ఇల్లు వదిలిపోయేటప్పుడు అన్నం గిట్ల ఉంటె అండ్ల విషం కలిపి పెట్టిపోవాలె వంటివి చెప్పేది. సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు వాటినెదుర్కోవాలంటే ఏం చెయ్యాలె ? స్త్రీలను ముందుకెట్లా తీసుకురావాలి అన్న విషయాలు ఎంతో ఉత్తేజంతో ప్రసంగించేది. చదువు విషయంలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేది. వీధివీధికి గ్రూపు మీటింగులు పెట్టేది. సూర్యాపేటలో ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత [[[[హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం|హుజూర్‌ నగర్‌]]]] లో మరికొంత కాలం పనిచేసింది.
 
ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో సొంత ఊళ్ళో వుండకుండా రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కలిగింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు బాగా హింసించినా ఆచూకీ చెప్పలేదు. అమ్మను, నాన్నను చూసేందుకు ఊరొచ్చింది ప్రియంవద. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చేసి స్టేషనుకు తీసుకుపోయిన్రు. రోజులు తుంగతుర్తి క్యాంపుల ఉంచిన సూర్యాపేటకు తీసుకుపోయిండ్రు. ఒక్కరోజుంచి హైదరాబాద్ తీసుకపోయిండ్రు. అలా ఆమెను చంచల్‌గూడ జైల్ల మూడు తర్వాత బయటికి వచ్చింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు