మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
17వ శతాబ్దంలో తనను ప్రేమించిన విషయం తనకి తెలుసంటూ, ఆ విషయం ఇప్పుడైనా చెప్పమంటూ రాకుమారి ([[కాజల్ అగర్వాల్]]) అభ్యర్థించడంతో సినిమా ప్రారంభమౌతుంది. తన అంగరక్షకుడు, ప్రేమికుడు ఐన కాలభైరవ ([[రామ్‌చరణ్ తేజ్]]) కోసం చేయిజాస్తుంది. అప్పటికే ఆమె కొండకొమ్ముపై రక్తిసిక్తమై ఉంటుంది, అతని స్థితీ అదే. అతను చేయందించే సరికి ఆమె తుళ్ళిపోయి లోయలోకి జారిపోతుంది. హతాశుడైన కాలభైరవ ఆమె కోసం పరుగులెత్తి దూకేస్తాడు. చివరకి వారిద్దరూ పడిపోవడంలోనూ ఒకరి కోసం ఒకరు చేయిజాపుతూంటారు, కానీ కలుసుకోకుండానే పడి మరణిస్తారు. అతని స్నేహితుడు షేర్ ఖాన్ ([[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]) కాలభైరవ రక్షణ కవచానికి చితి అంటించి, దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ "కమ్ముకొస్తున్న చీకటిని చీల్చుకుంటూ మళ్ళీపుడతావురా భైరవా" అంటూండగా సన్నివేశం ముగుస్తుంది.
 
21వ శతాబ్దంలో దూసుకువస్తున్న బైక్ రేసర్ హర్ష ([[రామ్‌చరణ్ తేజ్]])పై మళ్ళీ కథ కొనసాగుంది, హర్ష సిటీలో జరిగే కష్టమైన పోటీల్లో కూడా విజయం సాధిస్తూంటాడు. విదేశాల్లో బైక్ రేసుల్లో పాల్గొనేందుకు హర్ష వానలో ఆటోలో వెళ్తూంటాడు. అతను వాన వల్ల ఏర్పడ్డ మసకలో ఓ అమ్మాయి ఆటోను ఆపేందుకు చేయి ఊపడం చూస్తాడు, ఆటో నిండిపోయిందని చేయివూపి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా అతని వేళ్ళు, ఆమె వేళ్ళకు తగులుతాయి, హర్ష ఆ స్పర్శలో విద్యుత్ ప్రవాహం అనుభూతి చెందుతాడు, దాంతో పాటుగా కొన్ని దృశ్యాలు కూడా కనిపిస్తాయి. తర్వాత, ఆమెను చేరుకునేందుకే జన్మించానన్నంత భావం కలిగి, ఆమె కోసం తిరిగివచ్చి ఆ బస్టాప్ లో ఆమె వేసుకున్న డ్రస్ రంగు బట్టి ఆరాతీస్తాడు.
<!-- Later, feeling that this was the girl he was destined to be with, he enquires about her to a woman named Indira (called "Indu"), without realising that she is the same girl. Indu, thinking that he is stalking her, misdirects him. She and her friends take advantage of Harsha, duping him out of his finances. Meanwhile, Indu's distant cousin Raghuveer, lusts after her. He manipulates Indu and her father into trusting him. However, whenever he attempts to touch a sleeping Indu, he sees visions of a warrior slitting his throat. Raghuveer consults a [[Tantra|tantrik]], Ghora, who reveals to him that in a prior life, he was a prince who lusted after Indu, and was killed by her lover, a warrior. Raghuveer is determined to find the [[reincarnation]] of the warrior and kill him. Meanwhile, Harsha discovers how Indu and her friends have been defrauding him, and she falls in love with him. -->
 
"https://te.wikipedia.org/wiki/మగధీర_(సినిమా)" నుండి వెలికితీశారు