మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
21వ శతాబ్దంలో దూసుకువస్తున్న బైక్ రేసర్ హర్ష ([[రామ్‌చరణ్ తేజ్]])పై మళ్ళీ కథ కొనసాగుంది, హర్ష సిటీలో జరిగే కష్టమైన పోటీల్లో కూడా విజయం సాధిస్తూంటాడు. విదేశాల్లో బైక్ రేసుల్లో పాల్గొనేందుకు హర్ష వానలో ఆటోలో వెళ్తూంటాడు. అతను వాన వల్ల ఏర్పడ్డ మసకలో ఓ అమ్మాయి ఆటోను ఆపేందుకు చేయి ఊపడం చూస్తాడు, ఆటో నిండిపోయిందని చేయివూపి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అనుకోకుండా అతని వేళ్ళు, ఆమె వేళ్ళకు తగులుతాయి, హర్ష ఆ స్పర్శలో విద్యుత్ ప్రవాహం అనుభూతి చెందుతాడు, దాంతో పాటుగా కొన్ని దృశ్యాలు కూడా కనిపిస్తాయి. తర్వాత, ఆమెను చేరుకునేందుకే జన్మించానన్నంత భావం కలిగి, ఆమె కోసం తిరిగివచ్చి ఆ బస్టాప్ లో ఆమె వేసుకున్న డ్రస్ రంగు బట్టి ఆరాతీస్తాడు. ఆమె అప్పుడే వాన వల్ల రెయిన్ కోట్ వేసుకోవడంతో ఆమె గురించి ఆమెనే అడుగుతాడు. ఆమె పేరు ఇందూ, అంటూండే ఇందిర ([[కాజల్ అగర్వాల్]]) అని తెలుస్తుంది. ఇందు, తనను చూడకుండానే డ్రెస్ చూసి వెంటపడడం ఆసక్తిగా అనిపించి, అతనికి ఇందును పరిచయం చేస్తానని కట్ చేయకుండా కొనసాగిస్తుంది. అయితే ఎలాంటివాడో తెలియదు కనుక తప్పుదోవ పట్టిస్తూంటుంది. ఆమె, ఆమె స్నేహితులు అతనికి ఇందుపై ఉన్న ప్రేమని అవకాశంగా తీసుకుంటారు. ఇంతలో ఇందు కుటుంబంతో సంబంధాలు తెగిపోయిన బావ రఘువీర్ ([[దేవ్ గిల్]]) ఆమె తండ్రి కేసువేయడంతో అతన్ని చంపేద్దామని వస్తాడు. అయితే ఇందును చూసి వెర్రెక్కిపోయి, ఆమెను పెళ్ళిచేసుకునేందుకు తమ కుటుంబాల మధ్య ఉన్న వివాదం వల్ల కుదరదని, తను చస్తే తప్ప ఇందు తండ్రి మాట్లాడడని చెప్పడంతో, తండ్రినే చంపేస్తాడు. తండ్రి చనిపోయిన విషయం చెప్తూ ఆ వంకతో ఇందును, ఆమె తండ్రిని మోసం చేసి ఇంట్లో స్థానం పొందుతాడు. నిద్రపోతున్న ఇందును ముట్టుకుందామని ప్రయత్నించగానే, ఓ కంటికి కనిపించని యోధుడు తన గొంతు కోసేస్తున్న అనుభూతి పొందుతాడు. రఘువీర్ ఈ విషయమై తాంత్రికుడైన ఘోరా ([[రావు రమేష్]]) ని కలుస్తాడు. అతని పూర్వజన్మలో ఇందూని మోహించిన రాకుమారుడనీ, యోధుడైన ఆమె ప్రేమికుడి చేతిలో చనిపోయాడని చెప్తాడు. అతను కూడా మళ్ళీ పునర్జన్మ పొందాడని, అతన్ని చంపితే తప్ప ఇందూని ముట్టుకోలేవని చెప్తాడు. అతన్ని కనిపెట్టి, చంపి ఇందూని దక్కించుకోవాలని రఘువర్ నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఇందు, ఆమె స్నేహితులు తనని ఆటపట్టిస్తున్నట్టు తెలుసుకుని ఆమె తనను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటాడు హర్ష.
 
వారిద్దరి ప్రేమ గురించీ తెలుసుకున్న ఇందూ తండ్రి, వారికి పెళ్ళిచేయాలని నిశ్చయించుకుని రఘువీర్, హర్షలకు చెప్తాడు. ఇందూ కింద లేని సమయం చూసుకుని ఇందూ తండ్రిని చంపి ఆ నేరాన్ని హర్ష మీద నెట్టేస్తాడు. హెలీకాఫ్టర్ మీద అప్పటికప్పుడు ఇందూను తీసుకుని వాళ్ళ కోటకు వెళ్ళిపోతూండగా, రఘువీర్ మనుషుల్ని కొట్టి అగ్ని ప్రమాదం ఎదుర్కొని మరీ హెలీకాఫ్టర్ కు వేళ్ళాడుతూ వెళ్తాడు హర్ష. ఇందూ చేయి తగలడంతో మళ్ళీ ఆ అనుభూతికి లోనై హెలీకాఫ్టర్ మీంచి పడిపోతాడు. ఓ సరస్సులో పడిపోతూ దాదాపు మృత్యువును దగ్గర నుంచి చూస్తాడు. ఆ సమయంలో ఇందూ చేతి స్పర్శ వల్ల అతనికి పూర్తిగా గత జన్మ జ్ఞాపకాలు మేల్కొంటాయి.
 
<!-- Raghuveer discovers that Harsha is the reincarnation of the warrior. He murders Indu's father and frames Harsha, causing Indu to hate Harsha. As Raghuveer and Indu leave in a helicopter, Harsha tries to catch them but fails; falling into a lake, he faces a [[near-death experience]] and learns about his past life in 1609. In that year, Emperor Sher Khan is preparing to invade the kingdom of Udayghar when he hears of the brave warrior Kala Bhairava (Harsha), [[commander-in-chief|commander]] of the Udayghad army. King Vikram Singh's daughter, Mithravindha Devi (Indu), loves Bhairava, but he holds himself back. Her cousin, Ranadev Billa (Raghuveer), lusts after Mithra and plans a competition between himself and Bhairava; the winner will marry her and the loser will be banished from Udayghad. Bhairava's victory leads to Ranadev's banishment. Vikram Singh, however, secretly requests that Bhairava not marry his daughter, because Bhairava has a high chance of dying in battle, and he does not wish to see Mithra widowed. Though shocked, Bhirava concedes to the king's request and publicly declines to marry Mithra, leaving her distraught.
1909లో ఉదయ్ పూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ సింగ్ ([[శరత్ బాబు]]) కుమార్తె మిత్రవింద దేవి (తర్వాతి జన్మలో ఇందు), ఆ రాజ్యసైన్యంలో ముఖ్యవీరుడు, సైనికులకు శిక్షణనిచ్చేవాడూ అయిన కాలభైరవ (హర్ష పూర్వజన్మ)ని ప్రేమిస్తుంది.
<!-- Raghuveer discovers that Harsha is the reincarnation of the warrior. He murders Indu's father and frames Harsha, causing Indu to hate Harsha. As Raghuveer and Indu leave in a helicopter, Harsha tries to catch them but fails; falling into a lake, he faces a [[near-death experience]] and learns about his past life in 1609. In that year, Emperor Sher Khan is preparing to invade the kingdom of Udayghar when he hears of the brave warrior Kala Bhairava (Harsha), [[commander-in-chief|commander]] of the Udayghad army. King Vikram Singh's daughter, Mithravindha Devi (Indu), loves Bhairava, but he holds himself back. Her cousin, Ranadev Billa (Raghuveer), lusts after Mithra and plans a competition between himself and Bhairava; the winner will marry her and the loser will be banished from Udayghad. Bhairava's victory leads to Ranadev's banishment. Vikram Singh, however, secretly requests that Bhairava not marry his daughter, because Bhairava has a high chance of dying in battle, and he does not wish to see Mithra widowed. Though shocked, Bhirava concedes to the king's request and publicly declines to marry Mithra, leaving her distraught.
-->
 
"https://te.wikipedia.org/wiki/మగధీర_(సినిమా)" నుండి వెలికితీశారు