అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
==హైదరాబాదులో ఏఎస్ రావు కాలనీ==
ఈసీఐఎల్ ఉద్యోగులు 1980లో సొసైటీని ఏర్పాటు చేసి సుమారు 120 ఎకరాల్లో డాక్టర్ ఏఎస్‌రావు పేర కాలనీ ఏర్పాటు చేశారు. దీనికి ఆయన పూర్తిగా సహకరించారు. ఆయన జయంతి సందర్భంగా ఈసీఐఎల్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఈసీఈసీహెచ్‌సీ సొసైటీ లిమిటెడ్, ఏఎస్ రావు కాలనీ సంక్షేమ సంఘం, ఈసీఓఏ, ఈసీఐఎల్ కార్మిక సంఘం తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఏఎస్‌రావు అవార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌లో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
==తపాలా కవర్==
హైదరాబాదులోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అనే‌ కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక సి.ఎం.డి అయిన ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ డా. A.S రావు (1914-2003) గారి శత జయంతి సందర్బంగా భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు.
 
==మూలాలు==