సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
|mandal_map=Cuddapah mandals outline30.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సిద్ధవటం|villages=18|area_total=|population_total=35261|population_male=17936|population_female=17325|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.68|literacy_male=75.92|literacy_female=46.95}}
 
'''సిద్ధవటం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>కడప నుంచి [[భాకరాపేట]] మీదుగా [[బద్వేలు]] వెళ్ళే మార్గంలో [[పెన్నా నది|పెన్నా]] నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో [[జైన మతము|జైనులు]] నివసిస్తూ ఉండేవారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.
== చరిత్ర ==
విజయనగర సామ్రాజ్య చక్రవర్తియైన వీర నరసింహదేవరాయలు క్రీ.శ.1506 నుంచి 1509 వరకూ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన పరిపాలన కాలంలో ఈ ప్రాంతాన్ని సంబెట గురవరాజు అనే సామంతుడు పరిపాలిస్తూండేవాడు. సంబెట గురవరాజు ఘోరమైన శిక్షలు విధించేవారు. ప్రజల వద్ద డబ్బు స్వీకరించేప్పుడు సొమ్ము ఇవ్వనివారి స్త్రీలను పట్టి అసభ్యంగా వారి స్తనాలకు చిరతలు పట్టించేవాడు. కూచిపూడి భాగవతులు ఈ గ్రామానికి వచ్చి ప్రదర్శనలు చేస్తూన్నప్పుడు గురవరాజు ఘోరకృత్యాలను చూసి తట్టుకోలేక విద్యానగరం(విజయనగరం) వెళ్ళిపోయారు. వీర నరసింహరాయల సమక్షంలో కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇచ్చేప్పుడు అవకాశం వినియోగించుకుని గురవరాజు వేషం, ఆయన ధనం సంపాదించే ప్రయత్నాలు చేయడం, చివరకు యువతి వేషం వేసుకున్న నటుడిని అసభ్యంగా స్తనాలకు చిరుతలు పట్టించడం వంటివి ప్రదర్శించారు. ఈ అసాధారణ ప్రదర్శన చూసి, ఇది ఇలా ఎందుకు ఉందని మంత్రులను, కొందరు సన్నిహితులైన సామంతులను ప్రశ్నించారు. వారిలో కొందరు సంబెట గురవరాజు చేస్తూన్న ఘోరకార్యకలాపాలను గురించి వివరించారు. దీనిపై ఆగ్రహోదగ్రుడైన రాయలు తర్వాత రోజు ఉదయాన్నే గురవరాజుపైకి సైన్యాన్ని పంపి, బందీని చేసి తీసుకువచ్చి, మరణశిక్ష విధించి వధించారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు