అందాల రాముడు (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== థీమ్స్, ప్రభావాలు ==
అందాల రాముడు దర్శకుడు [[బాపు]]కి ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు [[బడే గులాం అలీ ఖాన్]]పై చాలా అభిమానం. ఈ సినిమాలో జనతా కాలనీకి బామ్మగారిని చూసేందుకు సీత కార్లో వచ్చినప్పుడు రేడియోలోంచి బడే గులాం అలీ ఖాన్ ఆలపించిన ''యాద్ పియా'' [[టుమ్రీ]] వస్తూంటుంది. బడేపై అభిమానంతోనే కావాలనే ఆ పాట పెట్టినట్టు బాపు వెల్లడించారు.<ref name="నేనూ సంగీతం 1 బాపు">{{cite web|last1=బాపు|first1=(సత్తిరాజు లక్ష్మీనారాయణ)|title=నేనూ - సంగీతం 1|url=http://telugu.greatandhra.com/articles/mbs/nenu-sangeetham-1-56212.html|website=గ్రేటాంధ్ర|accessdate=28 July 2015}}</ref> బాపురమణల బాల్యమిత్రుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో ఇంజనీరుగా అప్పటికి పనిచేస్తున్న [[బి.వి.ఎస్.రామారావు]] (బాపురమణల మాటల్లో సీతారాముడు) వారి సినిమాల నిర్మాణంలో చాలా సహాయం చేశారు. ఈ సినిమా పూర్తిగా గోదావరిపైనే కావడంతో ఆయన బోటు నిర్మించడం నుంచి మొదలుకొని ఎన్నెన్నో ఏర్పాట్లు చేశారు. బాపురమణలు ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు సీతారామారావు అంటూ ఆయన పేరే పెట్టారు.
 
==పాటలు==