నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
=== చిత్రీకరణ ===
{{Quote box|width=30%|align=right|quote="జంధ్యాల ఏం తీస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో అర్థంకాక మొదట విసుక్కున్నాను. కానీ సినిమా చూశాకా అతను ఎంత ప్రతిభావంతుడో, సినిమా మీద ఎంత కమాండ్ ఉందో అర్థమయ్యింది."|source= —[[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]] సినిమా చిత్రీకరణలో జంధ్యాల శైలి గురించి తర్వాతికాలంలో హీరో [[విజయ నరేష్|నరేష్]] తో నిర్మాత [[నవతా కృష్ణంరాజు]].}}
నాలుగు స్తంభాలాట చిత్రీకరణను జంధ్యాల తనకు ఇష్టమైన [[విశాఖపట్నం]] పరిసరాల్లోనే చేశారు. విశాఖ, [[అరకులోయ]], [[భీమిలి]], [[యారాడ]] మొదలైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సినిమా షూటింగ్ కోసం జంధ్యాల తొలిచిత్రం సినిమా [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]] సినిమా కోసం తీసుకున్నట్టే విశాఖపట్నానికి చెందిన ఎం.వి.పి.కాలనీలో ఇళ్ళు అద్దెకి తీసుకుని యూనిట్ ఉండి చిత్రీకరణ జరుపుకున్నారు. చిత్రీకరణలో జంధ్యాల ప్రత్యేకమైన శైలిని అవలంబించేవారు. సీన్ విభజన, స్క్రిప్టులపై మంచి పట్టు ఉన్న జంధ్యాల సంభాషణలు మాత్రం ఎంచుకున్న లొకేషన్లను బట్టి రాసుకునేవారు. ఈ సినిమాలోని [[చినుకులా రాలి.. నదులుగా సాగి....|చినుకులా రాలి]] పాటను ముప్పై రోజుల పాటు కొద్ది కొద్దిగా తీశారు. కారులో లొకేషన్లు చూసుకుంటూ వెళ్ళి నప్పినచోట షూటింగ్ చేసే జంధ్యాల, రోజూ ముందుగా కొన్ని కొన్ని షాట్లు చినుకులా రాలి పాటకు తీసి, తర్వాత మిగిలిన సన్నివేశాలు తీసుకునేవారు. అంతేకాక కొన్ని సన్నివేశాలు, షాట్లు ఎందుకు తీస్తున్నారో, ఏం తీస్తున్నారో యూనిట్ కీ, స్క్రిప్టు పూర్తిగా తెలిసిన నిర్మాత వంటి కీలకమైనవారికీ కూడా అర్థమయ్యేది కాదు.<br />
అప్పటికి సీనియర్ నిర్మాతగానే కాక సినిమా రంగంపై మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా పేరున్న నిర్మాత నవతా కృష్ణంరాజు పరాజయాల్లో ఉండడంతో ఈ సినిమాపైనే అన్ని ఆశలూ పెట్టుకుని నిర్మించారు. ఆయనకు జంధ్యాల సినిమా తీసే ధోరణి అర్థంకాక విసుక్కునికొన్నాళ్ళు గొడవపడ్డారు. అయితే సినిమా పూర్తయ్యాకాపూర్తయ్యేకొద్దీ జంధ్యాల సినిమాపై మంచి కమాండ్ ఉన్న వ్యక్తి అని, అది ఆయన సినిమా తీసే శైలి అనీ అర్థమయింది కృష్ణంరాజుకు.<br />
ఈ సినిమా పాటల చిత్రీకరణలో వినూత్నమైన ప్రయత్నాలు చేశారు. నరేష్ మొదటిసినిమాగా చేద్దామనుకున్న [[ప్రేమ సంకెళ్ళు]] సినిమా మేకప్ టెస్ట్ కోసం నరేష్ కొన్ని మోటార్ సైకిల్ జంప్స్ చేశారు. దాన్ని చూసిన జంధ్యాల రాగమో, అనురాగమో పాట కోసం అతనితో ఫీట్స్ చేయించారు. కొండల్లో ఆరు అడుగుల ఎత్తు మీంచి మోటార్ సైకిల్ నడుపుతూ దూకేయమంటే హీరోహోండా సిబి 100 బండితో నరేష్ అలానే దూకేశారు. దూకిన ప్రదేశం జంపింగ్ కి అనుకూలంగా లేకపోయినా బైక్ మాత్రం సరిగానే దిగింది. అలానే చాలానే రిస్కీ ఫైట్లు ఆ ధైర్యంతో జంధ్యాల నరేష్ తో చేయించారు. గోదావరిలో కూడా సినిమాకోసం నరేష్ దూకారు. ఈ సాహసాల్లోనే భాగంగా విశాఖలోని ఎర్రకొండల్లో భూమి రబ్బర్ లా కిందకూ మీదకూ కదులుతూంటే తమాషాగా ఉందని అక్కడ నరేష్, పూర్ణిమలను నిలబెట్టి కొన్ని షాట్లు తీసుకున్నారు. ఇంతలో అక్కడివారు పరుగెత్తుకుంటూ వచ్చి- అది ఊబి.. దిగబడితే మళ్ళీ బతికి బయటపడరని చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.<br />
సినిమా నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చయింది, సుమారుగా 50 రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరుపుకుంది.<ref name= "జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్ 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>