లంక సత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==నేపధ్యము==
లంక సత్యం చిన్ననాటి నుంచి నాటకాల్లో వేషాలు వేసేవారు. ఆడవేషాలూ వేశారు. పాటపాడడం వచ్చును గనుక, హబ్బిన్స్ గ్రామఫోన్ కంపెనీలో చేరారు. తర్వాత, సినిమా మీద ఆసక్తి కలిగింది. 1935లో బొంబాయి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. నిరంజన్‌పాల్ అనే ఆయన దగ్గర దర్శకత్వంలో ఉద్యోగం చేశారు. మూడేళ్లపాటు నిరంజన్‌పాల్ తెలుగు సినిమా '''అమ్మ (1939)''' తీస్తే - ఆ సినిమాకి ముఖ్య సహాయకుడిగా సత్యం పనిచేశారు. ఒక విషాద పాత్ర కూడా వేశారు. అప్పుడు యుద్ధం వచ్చింది. ఆ దెబ్బకి సత్యం బొంబాయి నుంచి మద్రాసు వచ్చేశారు. నిరంజన్‌పాల్ ఇచ్చిన ఉత్తరంతో సత్యం ఆర్.ఎస్.ప్రకాష్ దగ్గర సహాయకుడిగా కుదిరారు. అప్పుడే ఆయన '''బారిష్టర్ పార్వతీశం ''' మొదలెడుతూ, పార్వతీశం పాత్రధారికోసం వెతకడం ఆరంభించారు.
 
===[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] ===
తెలుగులో మొదటిసారిగా వచ్చిన హాస్యచిత్రం 1940 నాటి '''[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]]'''. [[మొక్కపాటి నరసింహశాస్త్రి]]గారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరి యువకుడు, ఓడలో బయల్దేరి లండన్ వెళ్లడం కథ. దారంతా అతని చేష్టలు నవ్విస్తాయి. ఈ పాత్ర ధరించి నవ్వించినది - లంక సత్యం. మోడ్రన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, కంపెనీ పేరు మీద ఆర్.ఎస్. ప్రకాష్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. తెలుగువారిలో మొదటి మూకీ నిర్మించిన [[రఘుపతి వెంకయ్య]]గారి కుమారుడు ప్రకాష్. ఐతే, ఈ సినిమా నిడివి - అంటే, ఆ రోజుల్లో సినిమా మూడుగంటలైనా నడవాలి - చాలనందువల్ల ఇంకో రెండు చిన్న హాస్య సినిమాలు కలిపి విడుదల చేశారు. అవి బొండాం పెళ్లి, చదువుకున్న భార్య. ఈ సినిమాలకు [[హెచ్.ఎమ్.రెడ్డి]] దర్శకత్వం వహిస్తే [[ఎల్.వి.ప్రసాద్]] నటించారు. తర్వాత ప్రఖ్యాత నటిగా రాణించిన [[జి. వరలక్ష్మికి]] కి బారిష్టరు పార్వతీశం తొలి సినిమా.
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/లంక_సత్యం" నుండి వెలికితీశారు