కాశ్యపి వ్యాకరణము: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' '''శిష్యాణాం హితకామేవ కశ్యసేనాధ కాశ్యపి''' కాశ్యపి వ్యాకర...'
(తేడా లేదు)

17:57, 6 ఆగస్టు 2015 నాటి కూర్పు

         శిష్యాణాం హితకామేవ కశ్యసేనాధ కాశ్యపి

కాశ్యపి వ్యాకరణము అను నామముతో ఒక సంస్కృత వ్యాకరణము కలదు. తృషిమృషికృశేః కాశ్యపస్య (1-2-25); నోదాత్తస్వరితోదయ మగార్గ్య కాశ్యపగాలవానాం (9-4-67) అను సూత్రములు అష్టాధ్యాయి యందున్నవి. వీనివలన కాశ్యపివ్యాకరణగ్రంధము ఒకానొక కాలమునందు ఉన్నత్లు తెలియుచున్నది. కాశ్యపి పాణిని కి ప్రమాణ పురుషుడనియు, మహర్షి యనియు తోచును. కాశ్యపకౌశికాభ్యా మృషిభ్యాంణినిః (4-3-103) అను పాణిని సూత్రమువలన, కాశ్యపి ప్రోక్తమైన కల్పసూత్రమో, వ్యాకరణమో 'కాశ్యపి' నామమున ప్రసిద్ధమైయుండవచ్చును. కాశ్యపి ఋషిగ్రంధమేదియు లభ్యముకాలేదు.

ఈ వ్యాకరణము నందు అధ్యాయముల సంఖ్య గాని, సూత్రముల వివరణము గాని, సూత్రముల సంఖ్య గాని తెలియలేదు. ఈ వ్యాకరణమును గురుంచి పలువురు వారి గ్రంధములలో నామము మాత్రమే తెలియ పరిచిరి. మిగతా విషయాలు తెలియలేవు.

మూలాలు

1. భారతి మాస సంచిక.