భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

866 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
== నిర్మాణం ==
=== చిత్రీకరణ ===
భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ [[బుట్టాయగూడెం]], [[పట్టిసీమ]], [[గూటాల]] తదితర ప్రాంతాల్లో జరిగింది. బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్.స్వామి]], ఆపరేటివ్ కెమేరామేన్ గా [[ఎస్.గోపాలరెడ్డి]] వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు. మేకప్ విభాగంలో మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు పనిచేశారు. కాస్ట్యూమ్స్ బి.కొండయ్య సమకూర్చగా, ఫైట్ మాస్టర్ గా రాఘవులు వ్యవహరించారు. [[బాపు]] సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనకు సహాయదర్శకునిగా కంతేటి సాయిబాబా పనిచేశారు.<ref>[https://www.youtube.com/watch?v=nHYAhnErTyM అందాల రాముడు సినిమా టైటిల్స్ లోని వివరాలు]</ref> సినిమా సెట్లు కొంతవరకూ కళాదర్శకుడు భాస్కరరాజు వేశారు. అయితే ఆయనకు వేరే అత్యవసరమైన పని ఏర్పడడంతో ఈ సినిమా వదిలేసి మద్రాసు వెళ్ళారు. దాంతో యుద్ధక్షేత్రం(ఎరీనా)ను నిర్మించే పనులు సగంలో నిలిచిపోయాయి. బాపురమణలు, నిర్మాత అందుకు బాపురమణల స్నేహితుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న [[బి.వి.ఎస్.రామారావు]] సరైన వ్యక్తి అని భావించి ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు.
 
== మూలాలు ==
39,230

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1583992" నుండి వెలికితీశారు