"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

=== అభివృద్ధి ===
ముళ్ళపూడి వెంకటరమణ ఆంగ్ల చలనచిత్రం ''high noon'' అనుసరించి సాక్షి అనే కథను రాశారు.<ref name="సారంగలో బాపు హీరోయిన్లపై వ్యాసం">{{cite web|last1=|first1=ల.లి.త|title=బొమ్మలోంచి సినిమాలోకి నడిచొచ్చిన ‘బాపూ తనపు’ హీరోయిన్!|url=http://magazine.saarangabooks.com/2014/09/03/%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A8/|website=సారంగ|accessdate=18 April 2015}}</ref> సాక్షి చిత్రకథను చాలావరకూ ఆ సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. కనుక ఈ సినిమా మూలకథాంశంపై హై నూన్ ప్రభావం ఉందని చెప్పవచ్చు. కథలో చివరకు కథానాయకుడి పాత్ర కూడా మంచి పాత్ర కాదన్న విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగునంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా కథానాయకుడిని అమాయకుడిగా నిలిపారు.<ref name="ఎమ్వీయల్ కథారమణీయం పీఠిక">{{cite book|last1=ఎమ్.వి.ఎల్.|first1=ప్రసాద్|title=కథారమణీయం-2|publisher=విశాలాంధ్ర పబ్లికేషన్స్|location=హైదరాబాద్|edition=1|chapter=ముందుమాట}}</ref><br />
అప్పటికి పెద్ద హీరోలతో తీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పాలవుతూండడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు చిన్న బడ్జెట్లో తీసే సినిమాలకు ఫైనాన్స్ చేద్దామన్న పాలసీకి వచ్చారు. దాంతో బాపురమణలు వారిని ఈ సినిమా కథతో సంప్రదించారు. ఆ మీటింగ్ లో భాగంగా నవయుగ ప్రతినిధులు "మీకు [[అక్కినేని నాగేశ్వరరావు]], [[దుక్కిపాటి మదుసూదనరావు]] తెలుసు కదా, పైగా అక్కినేని జీవితచరిత్ర కూడా రాసినట్టున్నారు, మరి వారికి ఈ ప్రయత్నాలు తెలుసా?" అని అడిగారు. దానికి రమణ-తెలియదని, చెప్పలేదని, లక్షలతో వ్యాపారమైన సినిమారంగంలో ఇలాంటి సిఫార్సులు నాకిష్టంలేదని, నచ్చితే అవకాశమివ్వమని సమాధానం చెప్పారు. అంతటి సినీతారలు తెలిసినా, నిజాయితీగా అవకాశం అడగడం నచ్చి వారు ఫైనాన్స్ చేయడానికి ముందుకువచ్చారు. సినిమా పూర్తిగా అవుట్-డోర్ లో షూటింగ్ చేసి, కొత్తవారిని హీరోహీరోయిన్లుగా పెట్టుకుని, పాటలు లేకుండా తీస్తామన్నారు. కథ విన్నాకా, వారు అవుట్-డోర్ షూటింగ్, కొత్తవారు వరకూ సరే కానీ పాటలు లేకపోవడం తెలుగువారు అంగీకరించలేరని చెప్పడంతో, ట్రీట్ మెంట్లో మార్పులు చేసుకుని పాటలు కూడా చేర్చారు.
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1584012" నుండి వెలికితీశారు