బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''బూర్గుల రామకృష్ణారావు''' బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు.

== జననం ==
రామకృష్ణరావు [[కల్వకుర్తి]] దగ్గరలోని [[పడకల్]] గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది.
 
== రాజకీయ జీవితం ==
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[కృష్ణదేవరాయాంధ్రభాషాశ్రీకృష్ణదేవరాయాంధ్ర నిలయంభాషానిలయం]] కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
 
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]] లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
Line 46 ⟶ 49:
1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, [[మధ్యప్రదేశ్]] విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు [[ఉర్దూ అకాడమీ]], భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, [[దక్షిణ భారత హిందీ ప్రచార సభ]], [[సంస్కృత పరిషత్‌]]ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.
 
== మరణం ==
 
[[1967]], [[సెప్టెంబర్ 14]] న బూర్గుల మరణించాడు.
 
== సాహితీ వ్యాసంగం ==