రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
== విజయాలు ==
బర్మన్ సంగీత దర్శకత్వంలో విజయవంతమైన మొదటి చిత్రం "తీస్రీ మంజిల్"(1966). ఈ సినిమాలో అవకాశం కోసం నిర్మాత, రచయిత "నాసిర్ హుస్సేన్" దగ్గర బర్మన్ సంగీత విభావరి ఏర్పాటు చేశాడట గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ. అందుకే ఈ సినిమా పాటలు విజయవంతం కావడానికి మూల కారణం సుల్తాన్ పురీ అనేవారట బర్మన్. ఈ సినిమాలోని ఆరు పాటలనూ సుల్తాన్ పురీ రాయగా [[మహ్మద్ రఫీ]] పాడారు. వాటిలో మూడు పాటలు యుగళ గీతాలు కాగా వాటిని [[మహ్మద్ రఫీ|రఫీ]]తో పాటు [[ఆశా భోస్లే]] పాడారు. తరువాత రోజుల్లో బర్మన్ ఆమెనే పెళ్ళి చేసుకున్నారు. ఈ చిత్రం సంగీత పరంగా ఘన విజయం సాధించడంతో బర్మన్ ను, గేయ రచయితగా సుల్తాన్ పురీని మిగతా ఆరు సినిమాలకు కూడా బుక్ చేసుకున్నాడట నాసిర్ హుస్సేన్. ఆ ఆరు సినిమాలలో సంగీత పరంగానూ, కమర్షియల్ గానూ ఘన విజయం సాధించిన బహారోన్ కె సప్నా(1967), ప్యార్ కి మౌసం(1969), యాదోం కీ బారాత్(1973), పడోసన్(1968) కూడా ఉన్నాయి. తన స్వంత సంగీత దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే జ్యుయెల్ థీఫ్(1967), ప్రేం పూజారీ(1970) సినిమాలకు తన తండ్రి వద్ద సహాయ సంగీత దర్శకునిగా పని చేశారు. తండ్రి ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఆరధన(1969) సినిమాలో [[కిషోర్ కుమార్]] పాడిన "మేరే సప్ నోం కీ రాణీ కబ్ ఆయేగీ తూ", "కోరా కాగజ్ థా యే మన్ మేరా" పాటలు ఆర్.డి.బర్మన్ కంపోజ్ చేసినవేనని పుకారు ఉండేది. ఆ సినిమాకు ఆర్.డి.బర్మన్ సహాయ సంగీత దర్శకునిగా వ్యవహరించారు.
== గుర్తింపు ==
1970వ దశకంలో బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన పలు సినిమాలు సంగీత పరంగా అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో ఎక్కువ సినిమాలు [[రాజేష్ ఖన్నా]] హీరోగా చేసినవే. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో [[కిషోర్ కుమార్]] పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కిషోర్ పాడినవే కాక [[లతా మంగేష్కర్]], [[మహ్మద్ రఫీ]], [[ఆశా భోస్లే]] పాడిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి.
బర్మన్ సంగీత దర్శకత్వంలో [[కిషోర్ కుమార్]] ఎన్నో పాటలను తను తప్ప మరెవరూ పాడలేనంతగా తన ముద్ర వేశారు.
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు