బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత అభిప్రాయాల తొలగింపు
పంక్తి 26:
== చిత్ర విశేషాలు ==
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయనం చేసారు. మాధవాచార్యులు,గోపాలాచార్యుల పాత్రలను ఆయన పోషించారు. సాక్షి, బంగారుపిచ్చుక చిత్రాలను చూసి చిత్రీకరణ విధానాన్ని మెచ్చుకొని నాగేశ్వరరావు గారే బాపు ముళ్లపూడి కి కాల్షీట్లు ఇచ్చేరని చెప్పుకుంటారు.
== సంభాషణా చాతుర్యం ==
ముళ్లపూడి వారి చతురత, హస్యప్రియత్వం ఈ చిత్రంలో అడుగడుగునా కనబడుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, మాధవకి మధ్య సంభాషణ రమ్యాతిరమ్యం. శ్రీకృష్ణుడితో మాధవ నవ్వుసలు లేవని అంటాడు అని తమ్ముడిమీద ఫిర్యాదు చేస్తాడు. అతడన్నట్టు నేను లేనేమో అంటాడు శ్రీకృష్ణుడు. కంటి ఎదురుగా నీవు కనబడుతున్నావని మాధవ అంటే అదికూడా నీభ్రమేనేనోమో అంటాడు శ్రీకృష్ణుడు. ఇధమిధ్ధంగా అస్థిత్వాన్ని, నాస్తికత్వాన్ని సమర్ధించకుండా మానవత్వమే గొప్ప వాదమని అంతర్లీనంగా చెప్పుతుంది ఈ చిత్రం.
==పాటలు==
అన్ని పాటలకు [[కె.వి.మహదేవన్]] సంగీతం సమకూర్చారు.