రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
== చివరి దశ ==
1980వ దశకం చివరలో [[బప్పి లహరి]] వంటి డిస్కో సంగీత దర్శకుల ప్రభావం బర్మన్ పై పడటం, ఆ ప్రభావంతో ఆయన చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో చాలా మంది నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. తీసిరీ మంజిల్(1966) నుంచి క్యామత్ సే క్యామత్(1988) దాక అన్ని సినిమాలలోనూ బర్మన్ తో సంగీతం చేయించుకున్న నాసిర్ హుస్సేన్ కూడా ఆయనకు సినిమాలు ఇవ్వడం మానేశారు. హుస్సేన్ ప్రెస్ తో మాట్లాడుతూ బర్మన్ చేసిన జమానే కో దిఖ్నా హై(1982), మంజిల్ మంజిల్(1984) సినిమాలు హిట్ కాకపోవడం, జబర్దస్త్(1985) సినిమాలో ఆయన ఇచ్చిన సంగీతం బర్మన్ శైలికి భిన్నంగా ఉండటం, ప్రజల్ని ఆకట్టుకోలేక పోవడం వల్లనే తాను ఇకపై తీసే సినిమాలకు బర్మన్ ను సంగీత దర్శకునిగా ఎంపిక చేయనని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత నిర్మాత సుభాష్ ఘాయ్ రామ్ లక్ష్మణ్(1989) సినిమాకు సంగీత దర్శకునిగా బర్మన్ ను తీసుకుంటానని వాగ్దానం చేసినా, ఆ సినిమాను బర్మన్ ఆర్కెస్ట్రాలో పనిచేసిన లక్ష్మీనాథ్‌-ప్యారేలాల్ కు ఇచ్చేశారు.
 
1986లో బర్మన్ స్వరపరచిన "ఇజ్జత్" సినిమాలోని పాటలు అతని కెరీర్ లో చాలా మంచి హిట్. కానీ ఈ సినిమా ఆర్ట్ ఫిలిం కావడంతో కమర్షియల్ గా అతని కెరీర్ కి పెద్ద ప్రయోజనం కలగలేదు. అందుకే అతని కెరీర్ తిరోగమనాన్ని ఆపలేకపోయాడు. ఈ సినిమాలోని నాలుగు పాటల్నీ ఆశా పాడగా, గేయ రచయిత [[గుల్జార్]] రాశారు. ఈ పాటలతో బర్మన్ విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని పాటలకు గానూ ఆశాకు ఉత్తమ నేపధ్యగాయనిగా, గుల్జార్ కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు వచ్చింది, కానీ బర్మన్ కు మాత్రం ఏ అవార్డూ లభించలేదు.
 
1988లో బర్మన్ గుండెపోటుతో బాధపడి, ఒక సంవత్సరం తరువాత లండన్ లో ది ప్రిన్స్ గ్రేస్ ఆసుపత్రిలో బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలోనే ఆయన చాలా పాటలను స్వరపరిచారు కానీ అవి ఎప్పటికి విడుదల కాలేదు. విదు వినోద్ చోప్రా తీసిన పరిందా(1989) సినిమాకు సంగీతం అందించారు. గ్యాంగ్ సినిమాలో "ఛోఢ్ కె నా జానే" అనే పాటాను బర్మన్ స్వరపరచగా ఆశా పాడారు. కానీ ఈ సినిమా విడుదల కావడానికి ముందే బర్మన్ చనిపోయారు. ఒకే ఒక పాట స్వరపరచడంతో ఈ సినిమాలోని మిగిలిన పాటలను అను మాలిక్ స్వరపరిచారు. ప్రియదర్శన్ తెరకెక్కించిన "తెన్మవిన్ కొంబత్" అనే మళయాళం సినిమాకు చివరగా సైన్ చేశారు బర్మన్. కానీ ఆయన దానిని స్వరపరచలేదు. 1942: ఎ లవ్ స్టోరి(1994) సినిమాకు సంగీతం అందించారు బర్మన్. ఆ సినిమా ఆయన చనిపోయిన తరువాత విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయనకు మూడవ, ఆఖరి ఫిలింఫేర్ అవార్డ్ లభించింది.
 
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు