"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
== బడ్జెట్ ==
సినిమా బడ్జెట్ మొదట రూ.2లక్షల 50వేలుగా అంచనా వేసుకున్నారు. నిర్మాతలుగా బాపురమణలకు ఇదే మొదటి చిత్రం కావడంతో ఫైనాన్స్ చేసేందుకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారిని సంప్రదించారు. వారు అంగీకరించి బాపురమణలు రూ.25వేలు పెట్టుబడి పెట్టగానే రూ.50వేలు విడుదల చేశారు. అయితే మొట్టమొదట బాపురమణలు టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు ఎవరికైనా రూ.పదివేలు లోపే రెమ్యూనరేషన్ ఉండేలా ఎంచుకోవాలనుకున్నారు. దర్శకుడు బాపుకు రూ.10వేలు, సంగీత దర్శకుడు మహదేవన్ కు రూ.10వేలు, రచయిత రమణకు రూ.7వేలుగా అంచనా వేసుకున్నారు. అయితే నవయుగ వారు కొత్త దర్శకుడు కాబట్టి సీనియర్ని ఛాయాగ్రాహకుడిగా పెట్టుకోమనడం, అందుకు సెల్వరాజ్ ను అనుకోవడం జరిగింది. ఆయన అప్పటికే రూ.16వేలు తీసుకుంటున్న టెక్నీషియన్ కావడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెరిగింది. సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రోజుల్లో కృష్ణ కొత్తనటుడు కావడంతో రూ.4వేలు, అప్పటికే బి.ఎన్.రెడ్డి వంటి ప్రతిష్టాత్మక దర్శకుని వద్ద పనిచేసిన నటి కావడంతో విజయనిర్మలకు రూ.6వేలు పారితోషికం ఇచ్చారు. షూటింగ్ 16రోజులు గడిచేసరికి దాదాపు రూ.లక్ష లోపుగా ఖర్చయింది. 16వ రోజున ప్రింట్ అయ్యి, ఒక వరసలో అమర్చిన ఫిలం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేస్తున్న సెల్వరాజ్ సినిమా చిత్రీకరిస్తున్న పులిదిండికి రప్పించారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1584715" నుండి వెలికితీశారు