సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
== బడ్జెట్ ==
సినిమా బడ్జెట్ మొదట రూ.2లక్షల 50వేలుగా అంచనా వేసుకున్నారు. నిర్మాతలుగా బాపురమణలకు ఇదే మొదటి చిత్రం కావడంతో ఫైనాన్స్ చేసేందుకు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారిని సంప్రదించారు. వారు అంగీకరించి బాపురమణలు రూ.25వేలు పెట్టుబడి పెట్టగానే రూ.50వేలు విడుదల చేశారు. అయితే మొట్టమొదట బాపురమణలు టెక్నీషియన్లకు, ఆర్టిస్టులకు ఎవరికైనా రూ.పదివేలు లోపే రెమ్యూనరేషన్ ఉండేలా ఎంచుకోవాలనుకున్నారు. దర్శకుడు బాపుకు రూ.10వేలు, సంగీత దర్శకుడు మహదేవన్ కు రూ.10వేలు, రచయిత రమణకు రూ.7వేలుగా అంచనా వేసుకున్నారు. అయితే నవయుగ వారు కొత్త దర్శకుడు కాబట్టి సీనియర్ని ఛాయాగ్రాహకుడిగా పెట్టుకోమనడం, అందుకు సెల్వరాజ్ ను అనుకోవడం జరిగింది. ఆయన అప్పటికే రూ.16వేలు తీసుకుంటున్న టెక్నీషియన్ కావడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెరిగింది. సినిమాలో కథానాయకునిగా పనిచేసిన రోజుల్లో కృష్ణ కొత్తనటుడు కావడంతో రూ.4వేలు, అప్పటికే బి.ఎన్.రెడ్డి వంటి ప్రతిష్టాత్మక దర్శకుని వద్ద పనిచేసిన నటి కావడంతో విజయనిర్మలకు రూ.6వేలు పారితోషికం ఇచ్చారు. షూటింగ్ 16రోజులు గడిచేసరికి దాదాపు రూ.లక్ష లోపుగా ఖర్చయింది. 16వ రోజున ప్రింట్ అయ్యి, ఒక వరసలో అమర్చిన ఫిలం డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేస్తున్న సెల్వరాజ్ సినిమా చిత్రీకరిస్తున్న పులిదిండికి రప్పించారు. చాలా అందంగా వచ్చినాయనిపించి, సౌండ్ ట్రాక్ 35 మీద కాకుండా సామాన్యమైన టేప్ రికార్డర్ పై రికార్డు చేసి జతచేసేశారు. దాన్ని నవయుగ డిస్ట్రిబ్యూషన్స్ మేనేజర్లు శర్మ, నర్సయ్యలకు టూరింగ్ టాకీసులో చూపించారు. సరైన సౌండ్ లేని ఆ సినిమా చూడడంతో వారికి అది నచ్చకపోగా, అప్పటివరకూ ఇచ్చిన డబ్బు మూడునెలల్లో తిరిగి ఇచ్చేయాలని మిగిలిన పెట్టుబడి కోసం వేరెవరినైనా చూసుకోమని తేల్చి చెప్పేశారు.<br />
వేరే ఫైనాన్షియర్లు ఎవరు దొరుకుతారన్న ఆక్రోశంతో ముళ్ళపూడి వెంకటరమణ నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వాటాదారు, వసూళ్ళ విభాగానికి ఇన్ ఛార్జి అయిన చంద్రశేఖరరావుతో "ముహూర్తాలు పెట్టుకుని, చివర్లో వేరే పెళ్ళికొడుకుని చూసుకోమన్నట్టు, సినిమా నవయుగ వారు ఫైనాన్సు చేస్తున్నారన్న పేరు వచ్చేసి ఈ దశలో మేము చెయ్యం అంటే ఎలా"గంటూ నిలదీశారు. ఆయన మాట మీద అప్పటికి రూ.75 వేలు నవయుగ వారు ఇవ్వాల్సి వుండగా, రావాల్సిన లక్షా పాతికవేల రూపాయల్లో రూ.50వేలు తగ్గించుకుని రూ.75వేలు విడుదల చేయాలని లెక్కవేసి అడిగారు నిర్మాతలు రమణ, సురేష్ కుమార్.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు