"సాక్షి (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

వేరే ఫైనాన్షియర్లు ఎవరు దొరుకుతారన్న ఆక్రోశంతో ముళ్ళపూడి వెంకటరమణ నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వాటాదారు, వసూళ్ళ విభాగానికి ఇన్ ఛార్జి అయిన చంద్రశేఖరరావుతో "ముహూర్తాలు పెట్టుకుని, చివర్లో వేరే పెళ్ళికొడుకుని చూసుకోమన్నట్టు, సినిమా నవయుగ వారు ఫైనాన్సు చేస్తున్నారన్న పేరు వచ్చేసి ఈ దశలో మేము చెయ్యం అంటే ఎలా"గంటూ నిలదీశారు. ఆయన మాట మీద అప్పటికి రూ.75 వేలు నవయుగ వారు ఇవ్వాల్సి వుండగా, రావాల్సిన లక్షా పాతికవేల రూపాయల్లో రూ.50వేలు తగ్గించుకుని రూ.75వేలు విడుదల చేయాలని లెక్కవేసి అడిగారు నిర్మాతలు రమణ, సురేష్ కుమార్. సామాన్యంగా వసూళ్ళ విభాగమే చూసే చంద్రశేఖరరావు తప్పిపోయిన పెళ్ళి సంబంధంతో పోల్చడంతో మెత్తబడి, ఫైనాన్సు విభాగం చూసే వాసుకి ఆ దృష్టితోనే వివరించారు. దాంతో వాళ్ళు పాటల సౌండు జతచేసి, మాటలు చేర్చి డబ్బింగ్ జరిపి ఓ అయిదారు సీన్లు, పాటలు చూపించండి చూస్తామని చెప్పారు. అలాగే మద్రాసులో చేయగా, చూశారు. సినిమా వాళ్ళకు నచ్చడంతో మిగిలిన రూ.75వేలు విడుదల చేశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
== విడుదల ==
సినిమాను ప్రధానంగా నవయుగ డిస్ట్రిబ్యూషన్స్ అనుబంధ సంస్థ శ్రీఫిలింస్ డిస్ట్రిబ్యూషన్స్ వారు విడుదల చేశారు. సినిమా నిర్మాణ దశలో ఉండగానే రికార్డింగ్ థియేటర్లో పాటలు విని బావున్నాయని మెచ్చుకుని సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కుమార్ తమ్ముడు బెనర్జీ మైసూర్ ప్రాంతంలో సినిమా హక్కులు కొంటానన్నారు. అయితే ఆయన విడుదల సమయం దగ్గరపడుతున్నా ఆ విషయంపై ముందుకుకదలి డబ్బు ఇవ్వకపోవడంతో వేరే డిస్ట్రిబ్యూటర్లను వెతుక్కునే పనిలో నిర్మాతలు పడ్డారు. ప్రధాన పంపిణీదారులైన శ్రీఫిలంస్ వారు సినిమా బావుందనీ, త్వరగా విడుదల చేయాలని తొందరపడుతూంటే వేరే మైసూర్ పంపిణీ విషయమై తర్జనభర్జనలు సాగాయి. ఒకరోజు మైసూరు ప్రాంతంలో సినిమా హాళ్ళూ, పంపిణీ వ్యాపారం ఉన్న భక్తవత్సల, సురేంద్ర బ్రదర్స్ వచ్చి సినిమా చూశారు. వారు వాహినీ స్టూడియోకు చెందిన మూలా నారాయణస్వామి తమ్ముడు మూలా రంగప్ప కొడుకులు. భక్తవత్సలకు సినిమా విపరీతంగా నచ్చి, తాను మైసూర్ ప్రాంతంలో పంపిణీ తీసుకుంటానన్నారు. అప్పటికి బెనర్జీ ఇరవైవేల రూపాయలు లోపే ఇస్తానన్నా అవసరాల రీత్యా ఒప్పుకున్న రమణ ఆయన ఎంతకావాలి అని అడిగేసరికి రూ.25వేలు అడిగి ఒప్పించారు. దాంతో మైసూర్ ప్రాంతంలో వాళ్ళు విడుదల చేశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1584750" నుండి వెలికితీశారు