రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
1988లో బర్మన్ గుండెపోటుతో బాధపడి, ఒక సంవత్సరం తరువాత లండన్ లో ది ప్రిన్స్ గ్రేస్ ఆసుపత్రిలో బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలోనే ఆయన చాలా పాటలను స్వరపరిచారు కానీ అవి ఎప్పటికి విడుదల కాలేదు. విదు వినోద్ చోప్రా తీసిన పరిందా(1989) సినిమాకు సంగీతం అందించారు. గ్యాంగ్ సినిమాలో "ఛోఢ్ కె నా జానే" అనే పాటాను బర్మన్ స్వరపరచగా ఆశా పాడారు. కానీ ఈ సినిమా విడుదల కావడానికి ముందే బర్మన్ చనిపోయారు. ఒకే ఒక పాట స్వరపరచడంతో ఈ సినిమాలోని మిగిలిన పాటలను అను మాలిక్ స్వరపరిచారు. ప్రియదర్శన్ తెరకెక్కించిన "తెన్మవిన్ కొంబత్" అనే మళయాళం సినిమాకు చివరగా సైన్ చేశారు బర్మన్. కానీ ఆయన దానిని స్వరపరచలేదు. 1942: ఎ లవ్ స్టోరి(1994) సినిమాకు సంగీతం అందించారు బర్మన్. ఆ సినిమా ఆయన చనిపోయిన తరువాత విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయనకు మూడవ, ఆఖరి ఫిలింఫేర్ అవార్డ్ లభించింది.
== శైలి ==
 
ఆర్.డి.బర్మన్ హిందీ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త. ఒక మూస లాంటి సంగీతంతో విసిగిపోయిన సినీ ప్రేక్షకుల్ని కొత్త రకపు పాటల్తో ఆకట్టుకున్నడు. తన సంగీతంలో ఎలక్ట్రానిక్ రాక్, డిస్కో వంటి కొత్త రీతులను చొప్పించి తాజా సంగీతాన్ని ప్రజలకు అందించారు. రాజేష్ ఖన్నా సినిమాలలో కొత్త రకపు ప్రేమకథలకు విభిన్నమైన సంగీతాన్ని అందించి తనదంటూ ఒక ముద్రను బాలీవుడ్ సంగీతంలో వేశారు. బెంగాలీ జానపద సంగీతాన్ని సినీ సంగీతానికి దగ్గర చేశారు.
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు