రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
== శైలి ==
ఆర్.డి.బర్మన్ హిందీ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త. ఒక మూస లాంటి సంగీతంతో విసిగిపోయిన సినీ ప్రేక్షకుల్ని కొత్త రకపు పాటల్తో ఆకట్టుకున్నడు. తన సంగీతంలో ఎలక్ట్రానిక్ రాక్, డిస్కో వంటి కొత్త రీతులను చొప్పించి తాజా సంగీతాన్ని ప్రజలకు అందించారు. రాజేష్ ఖన్నా సినిమాలలో కొత్త రకపు ప్రేమకథలకు విభిన్నమైన సంగీతాన్ని అందించి తనదంటూ ఒక ముద్రను బాలీవుడ్ సంగీతంలో వేశారు. బెంగాలీ జానపద సంగీతాన్ని సినీ సంగీతానికి దగ్గర చేశారు.
 
పాశ్చాత్యం, ఆరబిక్ సంగీత రీతుల ప్రభావం తనపై ఉన్న ఆర్.డి.బర్మన్ ఆ సంగీతాలలోని అంశాలను తన శైలిలోకి మార్చుకున్నారు. వెదురు బొంగులతోను, గరుకు కాగితాలతోనూ సంగీతాన్ని సృష్టిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశారు. మొహొబ్బాకు స్వరపరచడానికి బీర్ సీసాలతో సంగీత సృష్టించారు. యాదోం కీ బారాత్(1973)లోని "చురాలియ హై తుమ్" అనే పాటలో కొంత భాగం కప్పులు, సాసర్లను ఉపయోగించి స్వరపరిచారు. సత్తే పే సత్తే(1982) నేపధ్య సంగీతంలో గుడ గుడ్ శబ్దాలు రావడం కోసం గాయిని అన్నెట్టె పింటో గొంతు సవరించుకున్న శబ్ధాలను రికార్డ్ చేసి ఉపయోగించారు. పడోసన్(1968)లోని "మేరే సామ్నే వాలీ ఖిడికీ మే" పాటలో వింత శబ్ధాలు రావడం కోసం దువ్వెనను గరుకు నేలపై గీసిన శబ్ధాలను వాడారట. ఇలా ఎన్నో ప్రయోగాలతో శ్రోతలను పాట విన్నంతసేపూ గిలిగింతలు పెడుతుంటారు.
 
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు