సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
19రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఎడిటింగ్, అప్పటికి ట్రయల్ కోసం డబ్బింగ్ చేసిన సీన్లు కాక మిగతా వాటికి డబ్బింగ్ పూర్తచేసుకున్నారు. రీరికార్డింగ్ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ చేశారు. చివర్లో చేసే టైటిల్ మ్యూజిక్ కోసం విభిన్నమైన ప్రయత్నం చేశారు. అంతకుముందు ఓసారి బాపురమణల ముందు విజయవాడలో మారుతీ టాకీసు అధినేత బెనర్జీ పల్లెటూరి డప్పుల మేళంతో కచేరీ ఏర్పాటుచేశారు. వాటిలో డప్పులూ, కంచాలు-పలుదోము పుల్లలతో వాయిస్తూంటారు. విజయవాడలో ఈ మేళాన్ని విన్న బాపుకు టైటిల్ మ్యూజిక్ సమయంలో గుర్తుకువచ్చి, "మనది పల్లెటూరి కథే కాబట్టి ఈ డప్పులూ, కంచాల మేళమే టైటిల్ మ్యూజిక్" అని నిర్ణయించారు. బెనర్జీ, నిర్మాత డూండీ సహకారంతో ఆ మేళం చేసిన పన్నెండుమంది కళాకారుల్నీ మద్రాసు తీసుకువచ్చి డప్పులూ కంచాలతోనే మూడు గతులతో తాళాలతో స్వరపరిచి రికార్డు చేసి దాన్నే ఉపయోగించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
== బడ్జెట్ ==
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు