ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| caption = పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
| birth_name = శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
| birth_date =[[జూన్ 4]], [[1946 ]]
| birth_place =[[కోనేటమ్మపేట]], [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =
| death_date =
పంక్తి 35:
| weight =
}}
'''పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం'''(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా '''''బాలు''''' అని పిలిచే ఈయన [[1946]] [[జూన్ 4]] న అప్పటి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని ''కోనేటమ్మపేట'' గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము [[తమిళనాడు]] రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
 
==బాల్యము==
ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో [[మద్రాసు]] లో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
Line 41 ⟶ 42:
==సినీరంగ ప్రవేశము==
[[Image:SPBphoto1.jpg|thumb|100px| ]]
బాలసుబ్రహ్మణ్యం [[1966]] లో నటుడు మరియు నిర్మాత అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా రంగప్రవేశము చేశాడు.<ref name=tamilstar> tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] గురించి వివరాలు [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది. </ref> ఈ చిత్రానికి[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.
 
==విజయ ప్రస్థానం==
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దుజే కేలియే]] లాంటి [[హిందీ]] చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి [[జాతీయ పురస్కారాలు]] లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది. </ref>
 
[[దస్త్రం:SP Balu News Paper.jpg|thumb|right| బాలసుబ్రహ్మణ్యం పై పేపర్లో వచ్చిన వ్యాసం]]
==పురస్కారాలు==
{|class="wikitable" style:"text-align:center"
Line 76 ⟶ 78:
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
 
 
 
 
[[వర్గం: బాలీవుడ్ నేపథ్య గాయకులు]]
[[వర్గం: ఫిలింఫేర్ అవార్డుల విజేతలు]]