రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
== ఇతరులపై బర్మన్ ప్రభావం ==
బర్మన్ మరణం తరువాత చాలా సినిమాలలో ఆయన పాటలు ఒరిజినల్ గానూ, రీమిక్స్ లగానూ ఎన్నో వచ్చాయి. బర్మన్ శైలి, స్వరాల ప్రభావం చాలా మంది స్వరకర్తలపై ఉంది అనడానికి ఇవే నిదర్శనాలు. దిల్ విల్ ప్యార్ వ్యార్(2002) సినిమాలో ఆయన పాటలు చాలా రీమిక్స్ చేశారు. క్వాషిష్(2003) సినిమాలో [[మల్లికా శెరావత్]] బర్మన్ అభిమానిగా నటించింది. 2010లో బ్రహ్మానంద సింగ్ "పంచమ్ అన్ మిక్స్ డ్: ముఝే చల్తే జానా హై" పేరుతో 113 నిమిషాల నిడిచిగల షార్ట్ ఫిలింను విడుదల చేశారు. ఈ చిన్న సినిమాని బర్మన్ నివాళిగా చిత్రీకరించారు. లూటెరా(2013) సినిమాలోని సంగీతం కూడా ఆయన గుర్తుగా స్వరపరచినవే.
 
భారతీయ రీమిక్స్ ఆల్బములలో చాలా వాటిలో బర్మన్ పాటలు ఎక్కువగా ఉన్నాయి. బాలీ సాగూ చేసిన బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ ఆల్బమ్ దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. దక్షియ ఆసియా డిజేలు రీమిక్స్ చేసిన బర్మన్ పాటలు యునైటెడ్ కింగ్ డమ్ లోనూ, ఉత్తర అమెరికాలోనూ చాలా ప్రసిద్ధి చెందాయి. క్రోంస్ క్వర్టెట్ చేసిన ఆల్బమ్ యూ హేవ్ స్టోలెన్ మై హార్ట్(2005)లో రీమిక్స్ చేసిన ఆర్.డి.బర్మన్ పాటలే ఉన్నాయి. వాటిని ఆయన భార్య ఆశా పాడారు. 2012లో హిమేష్ రష్మి తీసిన ఖిలాడి 786 సినిమాలోని బల్మా పాట కూడా ఆయన నివాళిగా స్వరపరిచినదే.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు