అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టు టీం ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ అభివృద్ధిలో సమాధి అయిపోయిన వెంకటగిరి రాజకుమారి, ఆమె ప్రియుడు కథను లైన్ గా తీసుకుని దాన్ని గద్వాల నేపథ్యంలోకి మార్చారు. మరణించింది ప్రేయసీ ప్రియులు కాక ఓ మంత్రశక్తులున్న కీచకునిగా మార్పుచేశారు. స్క్రిప్టు అభివృద్ధి చేశాకా పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రం తంతు నుంచి అరుంధతి అన్న పేరు తీసుకుని టైటిల్ గా నిర్ణయించారు.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=వదల బొమ్మాళీ... వదల|url=http://www.sakshi.com/news/funday/arundhati-movie-behind-story-264943|website=సాక్షి|accessdate=9 August 2015}}</ref>
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో అరుంధతి పాత్రకు రాజసం ఉట్టిపడే, మంచి ఎత్తుగా ఉండే కథానాయిక కావాల్సివచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో [[మమతా మోహన్ దాస్]] అయితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు - శ్యామ్ సినిమా అంటే సంత్సరాల పాటు నిర్మాణం సాగుతూంటుందని, దాని వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతావని చెప్పడంతో ఆమె సినిమాను తిరస్కరించారు. ఆపైన వెతకగా [[అనుష్క శెట్టి|అనుష్క]] దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున [[సూపర్ (సినిమా)|సూపర్]] సినిమాలో రెండవ కథానాయికగా నటించి, రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన [[విక్రమార్కుడు]] సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగా, రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన - శ్యామ్ చాలా గొప్ప ఫిలిమ్ మేకర్ అనీ, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆపైన అనుష్క ఈ సినిమాను అంగీకరించారు.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" />
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు