అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
=== అభివృద్ధి ===
భారీవ్యయంతో, ఎంతో కష్టపడి నిర్మించిన [[అంజి (సినిమా)|అంజి]] సినిమా పరాజయం పాలవడంతో నిర్మాత [[శ్యామ్ ప్రసాద్ రెడ్డి]] నిరుత్సాహపడ్డారు. ఆయనను ఆ నిరుత్సాహం నుంచి తప్పించేందుకు వాళ్ళ కుటుంబసభ్యులు ప్రతి వీకెండ్ పార్టీలు నిర్వహించేవారు. ఆ క్రమంలో ఓ వీకెండ్ పార్టీకి వచ్చిన ఆయన బంధువు ఒకామె [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]] గురించిన రకరకాల వివరాలు చెప్పారు. అదే పార్టీలో ఆయన తాతగారు చెప్పిన [[వెంకటగిరి సంస్థానం]]లో జరిగిన మరో కథ చర్చకు వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిన్నతనం నుంచి అప్పుడప్పుడు వింటూవచ్చిన కథను ఆమె మళ్ళీ వివరించారు. గద్వాల రాజు కుమార్తె ఓ పనివాడితో ప్రేమలో పడింది, ఓసారి రాజా వారు, ఇతరులూ కూడా కోటలో లేని సమయంలో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. హఠాత్తుగా రాజు తిరిగివస్తే వారిద్దరూ లోపల ఏకాంతంగా ఉండడం తెలిసింది. ఉగ్రుడైన రాజు వాళ్ళను గదిలోనే ఉంచి, బయట నుంచి సమాధిలా గోడకట్టేశారు. లోపలున్నవాళ్ళు పెట్టిన కేకలు లోపలినుంచి మార్మోగాయి. అలా క్రమంగా వారు లోపలే మరణించారన్నది ఆ కథ సారాంశం. అయితే ఆసారి విన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఆ కథను చాలామంచి సినిమా కథగా మలచవచ్చన్న ఆలోచన తట్టింది. తర్వాత సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కడం ఆయనకు ఉత్సాహం కలిగించింది. అంజికి గ్రాఫిక్స్ వర్క్ చేసినవాళ్ళతో ఏర్పాటైన పార్టీలో మరో గ్రాఫిక్స్ అద్భుతాన్ని సృష్టిద్దామని ఆయన ప్రతిపాదించారు. దాంతో సినిమా స్క్రిప్టు పని ప్రారంభించారు.<br />
శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టు టీం ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ అభివృద్ధిలో సమాధి అయిపోయిన వెంకటగిరి రాజకుమారి, ఆమె ప్రియుడు కథను లైన్ గా తీసుకుని దాన్ని గద్వాల నేపథ్యంలోకి మార్చారు. మరణించింది ప్రేయసీ ప్రియులు కాక ఓ మంత్రశక్తులున్న కీచకునిగా మార్పుచేశారు. స్క్రిప్టు అభివృద్ధి చేశాకా పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రం తంతు నుంచి అరుంధతి అన్న పేరు తీసుకుని టైటిల్ గా నిర్ణయించారు. సినిమాకి మొదట దర్శకునిగా తమిళ దర్శకుడు [[సభాపతి]]ని తీసుకుందామని భావించారు. ఆయనకు కథ వివరించి ట్రయల్ షూట్ చేయమని అవకాశం ఇచ్చారు. ఆ ట్రయల్ షూట్ చేశాకా వచ్చిన ప్రాడక్ట్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. సీరియల్ నటులతో, వీడియో కెమెరాపై ఇంతకన్నా క్వాలిటీ ఎలా వస్తుందని సభాపతి ప్రశ్నించడంతో, సినిమాలో నటించబోయేవాళ్ళనే పెట్టి సినిమాకు వినియోగించే కెమేరా ఇచ్చి మరో ప్రయత్నం చేయమన్నారు శ్యామ్. అయితే అంత రియల్ టైం నటులు, ఎక్విప్మెంట్ తో సభాపతి తీసిన ట్రయల్ వెర్షన్ కూడా నిర్మాత నచ్చకపోవడంతో అవకాశం సభాపతి చేజారిపోయింది.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=వదల బొమ్మాళీ... వదల|url=http://www.sakshi.com/news/funday/arundhati-movie-behind-story-264943|website=సాక్షి|accessdate=9 August 2015}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు