అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో అరుంధతి పాత్రకు రాజసం ఉట్టిపడే, మంచి ఎత్తుగా ఉండే కథానాయిక కావాల్సివచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో [[మమతా మోహన్ దాస్]] అయితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు - శ్యామ్ సినిమా అంటే సంత్సరాల పాటు నిర్మాణం సాగుతూంటుందని, దాని వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతావని చెప్పడంతో ఆమె సినిమాను తిరస్కరించారు. ఆపైన వెతకగా [[అనుష్క శెట్టి|అనుష్క]] దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున [[సూపర్ (సినిమా)|సూపర్]] సినిమాలో రెండవ కథానాయికగా నటించి, రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన [[విక్రమార్కుడు]] సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగా, రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన - శ్యామ్ చాలా గొప్ప ఫిలిమ్ మేకర్ అనీ, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆపైన అనుష్క ఈ సినిమాను అంగీకరించారు. సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రతినాయకుడిది. ఈ పాత్రకు తమిళనటుడు పశుపతిని తీసుకుందామని భావించి పాత్రకి పశుపతి అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఆయనకు అఘోరా వేషం బాగానే సరిపోయినా, అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడే సన్నివేశాల్లో తేలిపోయినట్టు అనిపించడంతో ఆయనని తీసుకోలేదు. ''అశోకా'' అన్న హిందీ సినిమా చూస్తూండగా అందులో నటించిన [[సోనూ సూద్]] ఈ పాత్రకు సరిపోతారన్న నమ్మకం కలిగింది శ్యామ్ కు. అప్పటికి కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాని సోనూ సూద్ ను ఇందులో పశుపతి పాత్రకు తీసుకున్నారు. ఫకీర్ పాత్రకు ముందు [[నసీరుద్దీన్ షా]] అయితే బావుంటుందనుకున్నా వీలుదొరకలేదు.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" />
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు