అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
===గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్===
అరుంధతి సినిమాకు గ్రాఫిక్స్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివే కీలకమైనవి. దాంతో సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని నడిపించే [[రాహుల్ నంబియార్]] కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు. సినిమాలో కథాచర్చల దశ నుంచీ రాహుల్ నంబియార్ పాలుపంచుకున్నారు. ఆ దశ నుంచే విలన్ మేకప్, సెట్లు ఎలావుండాలో స్కెచ్ లు వేసుకుని, అందులో ఆయా విభాగాలు చేసేవి ఏమిటో, తాను క్రియేట్ చేయాల్సినవేమిటో స్పష్టత సాధించారు. చిత్రీకరణలో దాదాపు అంతటా ఆయన పాలుపంచుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ జతచేయాల్సిన సన్నివేశాల్లో నటుల కదలికలు ఎలావుండాలి, కెమెరా కోణాలు ఎటుండాలి వంటివన్నీ రాహుల్ స్వయంగా చూసుకునేవారు.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" /> సినిమా చిత్రీకరణ పూర్తయ్యాకా, ముందు చేసుకున్న ప్రయత్నాలను కొనసాగిస్తూ విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు.
== విడుదల ==
అరుంధతి సినిమాని 2009 సంక్రాంతి నాటికి విడుదల చేశారు. సినిమా నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ భారీ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాకపోవడం, వచ్చినవారు కూడా నిర్మాత లాభాలు కళ్ళజూసే రేటు చెప్పకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి స్వయంగా అన్ని ఏరియాల్లోనూ విడుదల చేసుకున్నారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు