అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము.
== చరిత్ర ==
 
ఇంటర్నెట్టు [[1969]]వ సంవత్సరంలో [[అమెరికా]] భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ '''ఆర్పా'''(ARPA)"లో సృష్టించబడినది. తరువాత [[1990]]వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన "టిం బెర్నెర్స్ లీ" స్విట్జర్ల్యాండ్ లోని [[సెర్న్]](CERN) వద్ద "వరల్డ్ వైడ్ వెబ్(www)"ను సృస్టించాడు. ప్రస్తుతం మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP)లకు కొంత రుసుము చెల్లించి మన కంప్యూటర్లను ఇంటర్నెట్టుకు అనుసంధానించవచ్చు.
===కాలమానం (కొన్ని ముఖ్య ఘట్టాలు)===
* 1969 - అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణా విభాగం ఆధ్వర్యంలో RAND (రాండ్) అనే పరిశోధనా సంస్థ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మొదటి సారిగా రెండు నోడలు కలుపబడ్డాయి. ఇదే తర్వాత ARPANET గా ఉద్భవించింది.<ref>[http://www.internetsociety.org/internet/what-internet/history-internet/short-history-internet ఇంటర్నెట్ సంక్షిప్త చరిత్ర ఆంగ్లంలో]</ref>
* 1979 - బ్రిటీష్ తపాలా కార్యాలయం మొదటి అంతర్జాతీయ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీ ఉపయోగించడం ప్రారంభించింది .<ref>[https://web.archive.org/web/20030405153523/http://www.sigtel.com/tel_hist_brief.html బ్రిటిష్ టెలికాం చరిత్ర ముఖ్య ఘట్టాలు ఆంగ్లములో]</ref>
* 1980 - బిల్ గేట్స్ IBM (ఐ.బి.ఎం ) కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించడానికి ఒప్పందం కుదురింది
* 1984 -
* 1989 -
* 1996 -
* 2009 -
==అంతర్జాలం పని చేసే విధానం==
 
చాల మందికి ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్య ఉన్న తేడా తెలియదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడెస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప ములిగిపోయే నష్టం ఏమీ లేదు కాని ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది.
 
====ఇంటర్‌నెట్(అంతర్జాలం) ====
 
అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక. మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే “రైల్వే నెట్‌వర్క్” (railway network) అంటాం. తెలుగులో కావలిస్తే “వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు” అని అనవచ్చు, లేదా టూకీగా “రైలు మార్గాల వలయం” అనో మరీ టూకిగా “రైలు వలయం” అనో అనొచ్చు.
Line 23 ⟶ 32:
ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళదాం. మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు; ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎం. ఎస్ .ఎం. రైలు వలయం (MSM rail network) అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి. ఎన్. ఆర్. రైలు వలయం (BNR rail network) అనేవారు. ఇలాగే “నైజాం రైలు వలయం,” “మైసూర్ రైలు వలయం” వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు. అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని “అంతర్‌వలయం” అనొచ్చు (అంతర్‌జాతీయం లా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “ఇంటర్” (inter) అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని “ఇంటర్‌నెట్” అనొచ్చు; లేదా తెలుగులో “అంతర్‌వలయం” అనో “ఉమ్మడి వలయం” అనో పిలవచ్చు. చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్‌జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు.
 
====వరల్డ్ వైడ్ వెబ్(పపప)====
 
మా ఊరు రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. మా ఉరుపాటి ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. మా ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్” ని తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాము కనుకనున్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు.
Line 39 ⟶ 48:
మన ఇంటికి వచ్చేవారంతా వీధి గుమ్మంలోకి వచ్చి తలుపు తడితే బాగుంటుంది కాని పాలవాడు పెరటి గుమ్మంలోకి వచ్చి పెళ్లాంతో సరసాలాడతానంటే ఏమి బాగుంటుంది? అందుకని పట్టు పుటని index.html పేజిగా నిర్మిస్తే మన వెబ్ సైట్‌కి వచ్చేవారందరికీ ముందుగా ముఖపత్రం కనిపిస్తుంది.
 
====వెబ్ బ్రౌజర్ అంటే ఏమిటి?====
 
ముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని “బ్రౌజింగ్” అంటారు. ఈ పని చేసే వ్యక్తిని "బ్రౌజర్" అంటారు. అంటే తెలుగులో “చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం,” వగైరా పనులని "వీక్షించడం" అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని "వీక్షకి" అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడ “బ్రౌజింగ్” అనొచ్చు.
Line 47 ⟶ 56:
మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్‌ప్లోరర్ (Explorer) కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీ (Safari) కి మద్దత్తు ఇస్తున్నారు. గూగుల్ కంపెనీ వారు క్రోం (Chrome) ని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్‌ఫాక్స్ (Firefox). ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి, ఆ క్రమంలో, క్రోం, ఫైర్‌ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే. అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు.
 
== చరిత్ర ==
ఇంటర్నెట్టు [[1969]]వ సంవత్సరంలో [[అమెరికా]] భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ '''ఆర్పా'''(ARPA)"లో సృష్టించబడినది. తరువాత [[1990]]వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన "టిం బెర్నెర్స్ లీ" స్విట్జర్ల్యాండ్ లోని [[సెర్న్]](CERN) వద్ద "వరల్డ్ వైడ్ వెబ్(www)"ను సృస్టించాడు. ప్రస్తుతం మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP)లకు కొంత రుసుము చెల్లించి మన కంప్యూటర్లను ఇంటర్నెట్టుకు అనుసంధానించవచ్చు.
===కాలమానం (కొన్ని ముఖ్య ఘట్టాలు)===
* 1969 - అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణా విభాగం ఆధ్వర్యంలో RAND (రాండ్) అనే పరిశోధనా సంస్థ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మొదటి సారిగా రెండు నోడలు కలుపబడ్డాయి. ఇదే తర్వాత ARPANET గా ఉద్భవించింది.<ref>[http://www.internetsociety.org/internet/what-internet/history-internet/short-history-internet ఇంటర్నెట్ సంక్షిప్త చరిత్ర ఆంగ్లంలో]</ref>
* 1979 - బ్రిటీష్ తపాలా కార్యాలయం మొదటి అంతర్జాతీయ కంప్యూటర్ నెట్వర్క్ టెక్నాలజీ ఉపయోగించడం ప్రారంభించింది .<ref>[https://web.archive.org/web/20030405153523/http://www.sigtel.com/tel_hist_brief.html బ్రిటిష్ టెలికాం చరిత్ర ముఖ్య ఘట్టాలు ఆంగ్లములో]</ref>
* 1980 - బిల్ గేట్స్ IBM (ఐ.బి.ఎం ) కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించడానికి ఒప్పందం కుదురింది
* 1984 -
* 1989 -
* 1996 -
* 2009 -
 
== =ఇంటర్నెట్ ఆడ్రస్ ===
ఇంటర్నెట్ కు అనుసంధానమైన ప్రతీ కంప్యూటరూ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్నే ఐపి(ఇంటర్నెట్ ప్రోటో కాల్ ) అడ్రసు అని వ్యవహరిస్తారు. ఇంటర్నెట్ లో ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్ కు సందేశాలు ఈ అడ్రసు ఆధారంగానే పంపబడతాయి.
 
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు