ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
=== అభివృద్ధి ===
[[స్విట్జర్లాండ్‌]] లో [[స్టూడెంట్ నంబర్ 1]] సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తై, యూనిట్ బయలుదేరుతున్నప్పుడు [[నల్లమలుపు బుజ్జి]] ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న [[వి.వి.వినాయక్]] ని పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం, కథ అంటూ చాలామందే ఆయనని విసిగిస్తూండడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాకా కలవమని చెప్పి పంపేశారు. బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టడంతో, ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకుని వాళ్ళని రమ్మన్నారు. తర్వాతి రోజు వినాయక్, బుజ్జి వచ్చారు. "మొత్తం కథ వద్దు, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చెప్పండి" అని ముందుగా చెప్పేశారు ఎన్టీఆర్, అందుకు వినాయక్ "ఒక్క ఇంట్రో మాత్రం చెప్తాను, నచ్చితేనే కూర్చోండి. మీ సమయం వృధా చేయదలుచుకోలేదు" అన్నారు. ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ రెండు గంటల పాటు కథ విన్నారు. అదొక ప్రేమకథ. ఎన్టీఆర్ కి కథ నచ్చింది, మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు. పరిశ్రమలో కూడా ఎన్టీఆర్, వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారమైపోయింది.<br />
సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు [[కొడాలి నాని]] ఆ దశలో ప్రేమకథలు వద్దని, యాక్షన్ సినిమాలపైనే దృష్టిపెట్టమని సలహాఇచ్చారు. దాంతో వినాయక్, బుజ్జిలను పిలిచి ఆ విషయాన్ని చెప్పి సారీ చెప్పేశారు ఎన్టీఆర్.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు