ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
=== అభివృద్ధి ===
[[స్విట్జర్లాండ్‌]] లో [[స్టూడెంట్ నంబర్ 1]] సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తై, యూనిట్ బయలుదేరుతున్నప్పుడు [[నల్లమలుపు బుజ్జి]] ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న [[వి.వి.వినాయక్]] ని పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం, కథ అంటూ చాలామందే ఆయనని విసిగిస్తూండడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాకా కలవమని చెప్పి పంపేశారు. బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టడంతో, ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకుని వాళ్ళని రమ్మన్నారు. తర్వాతి రోజు వినాయక్, బుజ్జి వచ్చారు. "మొత్తం కథ వద్దు, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం చెప్పండి" అని ముందుగా చెప్పేశారు ఎన్టీఆర్, అందుకు వినాయక్ "ఒక్క ఇంట్రో మాత్రం చెప్తాను, నచ్చితేనే కూర్చోండి. మీ సమయం వృధా చేయదలుచుకోలేదు" అన్నారు. ఇంట్రో చెప్పడంతో బాగా నచ్చిన ఎన్టీఆర్ రెండు గంటల పాటు కథ విన్నారు. అదొక ప్రేమకథ. ఎన్టీఆర్ కి కథ నచ్చింది, మనం ఈ సినిమా చేస్తున్నామని నిర్ధారించారు. పరిశ్రమలో కూడా ఎన్టీఆర్, వినాయక్ సినిమా గురించి వార్త ప్రచారమైపోయింది.<br />
సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ సన్నిహితులు [[కొడాలి నాని]] ఆ దశలో ప్రేమకథలు వద్దని, మాస్ సినిమాలపైనే దృష్టిపెట్టమని సలహాఇచ్చారు. దాంతో వినాయక్, బుజ్జిలను పిలిచి ఆ విషయాన్ని చెప్పి మాస్ కథ ఏదైనా ఉంటే చెప్పమన్నారు ఎన్టీఆర్. ఈ విషయం తెలిసి డీలాపడ్డ వినాయక్ అప్పటికప్పుడు తన వద్ద అలాంటి మాస్ కథ ఏమీ లేకపోవడంతో ఎప్పుడో రాసుకున్న సీన్లు గుర్తుచేసుకున్నారు. ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసే సన్నివేశం కాగా మరొకటి గాల్లోకి సుమోలు లేచే సన్నివేశం. ఆ రెండు సన్నివేశాలూ చెప్పి, నచ్చితే కథ తయారుచేస్తానని వినాయక్ చెప్పగా, ఫ్యాక్షన్ కథ నాకు మరీ హెవీ అయిపోతుందంటూ దాటవేయబోయారు ఎన్టీఆర్. "వారంరోజులు సమయం ఇస్తే కథ రాసుకుని వస్తాను, నచ్చితేనే చేద్దాం లేదంటే వేరెవరికైనా డేట్స్ ఇచ్చేద్దురు" అంటూ ఒప్పించారు వినాయక్. ఆ రాత్రి వినాయక్ రూంకి వచ్చీరాగానే అలిసిపోయిన బుజ్జి నిద్రపోగా, వినాయక్ మాత్రం అనుకున్న కథని అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అర్థరాత్రి 3 గంటలకు బుజ్జిని నిద్రలేపి కథ మౌలికంగా పూర్తిచేశానని వినిపించేశారు. కథ విన్న బుజ్జికి బాగా నచ్చింది. తిండి నిద్ర కనీసం బ్రష్ చేసుకోవడం కూడా మానేసి వినాయక్ కథ అభివృద్ధి చేసే పనిలోనే ఉండిపోయారు. అలా రెండు రోజులు గడిచాకా 58 సీన్లతో ఆది కథని తయారుచేసి ఎన్టీఆర్ కి వినిపించారు. బాగా ఎగ్జైట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమాకి అంగీకరించారు.<br />
[[బెల్లంకొండ సురేష్]] సమర్పకునిగా, నాగలక్ష్మి నిర్మాతగా, బుజ్జి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా ప్రారంభించారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు