ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
=== అభివృద్ధి ===
చిత్తూరు జిల్లాకు చెందిన [[మదనపల్లె]]లో చదువుకునే రోజుల్లో అక్కడికి సమీపంలోని [[బీ.కొత్తకోట]] గ్రామంలో జరిగిన ఓ సంఘటన చూశారు. ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన అంతిమయాత్రకు ఊరికి ఊరే కదలివచ్చింది, కారణమేంటంటే ఆయన జీవించినన్నాళ్ళూ చుట్టూ ఉన్నవాళ్ళు బావుండాలని కోరుకునేవారు. సాధ్యమైనంత సాయాన్ని పక్కవారికి చేసే అలవాటున్న వ్యక్తి కావడంతో ఊరు ఊరంతా ఆయన అంతిమయాత్రకు తరలివచ్చి కన్నీరు కార్చారు. ఈ సంఘటన మదన్ మనస్సును కదిలిచింది, ఈ సంఘటన ఆధారంగా తయారుచేసుకున్న కథని సీరియల్ స్క్రిప్ట్ గా అభివృద్ధి చేసుకున్నారు, స్క్రిప్ట్ పేరు అంతిమయాత్ర. సినిమా, సీరియల్ ప్రయత్నాలు చేస్తున్నరోజుల్లో ఈటీవీ కెమెరామేన్ మీర్ సహకారంతో ఈటీవీ వారికి ఈ కథని చెప్పారు. 26 ఎపిసోడ్లకు తయారుచేసిన స్క్రిప్ట్ లో మొదటి సీనులోనే కథానాయకుడి మరణం ఉండడం, చాలా ఎపిసోడ్లలో అంతిమయాత్ర సన్నివేశాలు చూపడం వంటివి ఉండడంతో సెంటిమెంటల్ గా భావించే వీక్షకులు ఈ సీరియల్ తిప్పికొడతారంటూ రిజెక్ట్ చేశారు.<br />
తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ [[ఎస్.గోపాలరెడ్డి]] వద్ద మదన్ అసిస్టెంట్ కెమెరామేన్ గా పనిచేశారు. ఆ సమయంలో పరిచయమైన దర్శకుడు రాంప్రసాద్ కి ఈ స్క్రిప్ట్ చాలా నచ్చింది. అభిరుచి కలిగి, మంచి చిత్రాలు తీసిన నిర్మాత [[అట్లూరి పూర్ణచంద్రరావు]] మళ్ళీ నిర్మాణం ప్రారంభించి [[వెంకీ]] సినిమా తీయడంతో ఆయనను సంప్రదించారు. ఆయన కథ విన్నాకా, బాగా నచ్చేసింది. మదన్ ని [[ఊటీ]] పంపించి, అక్కడ రూం వేసి సీరియల్ స్క్రిప్టు తిరగరాయించి పూర్తిస్థాయి సినిమా కథగా మలిచే బాధ్యత అప్పగించారు. అది పూర్తయ్యాకా దర్శకత్వం కోసం తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత [[భాగ్యరాజా]]ని పిలిపించి కథ చెప్పారు. ఆయనకు కథ బాగా నచ్చేసి, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చేస్తానని, అయితే తానే ప్రధానపాత్రలో నటిస్తానని ప్రతిపాదించారు. అది పూర్ణచంద్రరావుకు నచ్చకపోవడంతో ఆ ప్రయత్నమూ నిలిచిపోయింది. స్క్రిప్ట్ విని, కొన్ని మార్పులు చేసేందుకు మదన్ [[డి.వి.నరసరాజు]]ని కలిశారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు