ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
* యాపిల్‌లో చక్కెర మోతాదు 10నుండి 50 శాతం వరకూ ఉంటుంది. పచ్చి యాపిల్‌లో కొద్ది మొత్తాల్లో మాత్రమే స్టార్చ్ ఉంటుంది. పండే ప్రక్రియ మొదలైనప్పుడు ఇది మొత్తం చక్కెర పదార్థాంగా రూపాంతరం చెందుతుంది.
 
* యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
 
* ఉదరంలో గ్యాస్ తయారయ్యే తత్వం కలిగినవారు యాపిల్స్ వాడకూడదు. జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియా యాపిల్‌లోని తీపి పదార్థాలను పులిసేలా చేయటం దీనికి కారణం.
 
* గుండె స్పందనలను క్రమబద్ధీకరించటంకోసం డిగాక్సిన్ వాడే వారు యాపిల్స్‌ని తీసుకోకపోవటం మంచిది. యాపిల్స్‌లోని పెక్టిన్ పదార్థాలను డిగాక్సిన్‌ని బంధించి శరీరానికి అందనివ్వకుండా చేస్తాయి.
 
* యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సయనైడ్‌ని పోలిన విష పదార్థం ఉంటుంది. పిల్లలు కావాలని గాని లేదా అనుకోకుండా గాని యాపిల్ గింజలను అధిక మొత్తాల్లో తింటే ప్రాణప్రమాదం జరుగుతుంది.
 
* యాపిల్‌ని ఉడికించి గాని లేదా బేక్ చేసి గాని తినకూడదు. యాపిల్‌లో సహజంగా ఉండే విటమిన్-సి వేడి చేయటం ద్వారా నిర్వీర్యమవుతుంది.
 
* యాంటీ ప్లాట్యులెంట్ డైట్, లోఫైబర్ డైట్ తీసుకునేవారు యాపిల్స్‌ని వాడకూడదు.
 
యాపిల్‌ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్‌ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని కార్నెల్‌ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చిలో తేలింది. 'ట్రిటర్‌పెనాయిడ్స్‌'గా వ్యవహరించే ఈ పదార్థాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు, ధ్వంసమైన క్యాన్సర్‌ కణాలను శరీరం నుంచి బయటికి పంపించడంలోనూ వీటిది కీలకపాత్ర. తొక్కులోనే కాదు... పండులోనూ అనేక రకాల క్యాన్సర్‌ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ ఫినోలిక్‌ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్‌ తినమని సూచిస్తున్నారు వారు.
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు